భర్తను బలి చేసి ప్రియుడితో జీవితం.. రోజీ దుర్మార్గపు కుట్ర | Bengaluru Woman Allegedly Plots Husband Murder Over Extramarital Affair, More Details About This Case | Sakshi
Sakshi News home page

భర్తను బలి చేసి ప్రియుడితో జీవితం.. రోజీ దుర్మార్గపు కుట్ర

Feb 10 2026 8:49 AM | Updated on Feb 10 2026 10:09 AM

Women Frames Husband Brother-in-Law Incident

బెంగళూరు: అక్రమ సంబంధాల మోజులో పడిన భార్య.. భర్తను వదిలించుకోవాలని షాకింగ్‌ పథకం వేసింది. అతన్ని హంతకున్ని చేయాలని కుట్ర చేసింది. ఈ సంఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్‌ పట్టణంలో జరిగింది. భార్య కుట్ర  ఫలితంగా భర్త జైలు పాలయ్యాడు.  వివరాలు.. ఆనేకల్‌ తాలూకాలో ఆంథోనీ, రోజి భార్యాభర్తలు. రోజికి రాజేష్‌ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఇది తెలిసి భర్త ఆమెను మందలించేవాడు. తమ సంతోషానికి భర్త అడ్డంకిగా ఉన్నాడు, తరచూ తాగి వచ్చి వేధిస్తున్నాడనే నెపంతో భార్య తన భర్తను పునరావాస కేంద్రంలో చేర్పించింది. 

18 నెలల తర్వాత, భర్త ఆంథోనీ తిరిగి వచ్చాడు. భర్త లేని సమయంలో ఆమె ప్రియునితో సహజీవనం సాగించింది. భర్త రాగానే పథకాన్ని అమలు చేసింది. తమ బావ బాలరాజు మీద లేనిపోని మాటలు చెప్పి చంపేయాలని ప్రేరేపించింది. భార్య మాట విని ఆంథోనీ, తన అన్నయ్య బాలరాజ్‌ను కత్తితోపొడిచి హత్య చేశాడు. దీంతో ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీస్‌ స్టేషన్‌లో ఆంథోనీపై కేసు నమోదైంది. అరెస్టు చేసి చెరసాలకు తరలించారు. రోజి మళ్లీ ప్రియునికి దగ్గరైంది. అయితే రోజినే అసలు నిందితురాలని తెలిసి కేసు నమోదు చేసినట్లు తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement