
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువుశ్రావణ మాసం, తిథి: పౌర్ణమి ప.1.32 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: శ్రవణం ప.3.36 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: రా.7.35 నుండి 9.11 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.42 నుండి 7.27 వరకు, అమృత ఘడియలు: లేవు, శ్రావణ పౌర్ణమి, రాఖీ పండగ.
సూర్యోదయం : 5.44
సూర్యాస్తమయం : 6.27
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి పిలుపు రావచ్చు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనూహ్యమైన విజయాలు.
వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. అనారోగ్యం. ఇంటర్వ్యూలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిపెట్టవచ్చు.
మిథునం: వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. శ్రమపడ్డా ఫలితం ఉండదు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త గందరగోళ పరుస్తాయి.
కర్కాటకం: కొత్త పరిచయాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. దైవదర్శనాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.
సింహం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. నూతన విద్యావకాశాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
కన్య: రుణయత్నాలు ముమ్మరం. పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
తుల: కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
వృశ్చికం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో పేరుప్రతిష్ఠలు దక్కుతాయి. సోదరుల నుండి ధనలాభం. యత్నకార్యసిద్ధి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సంతృప్తినిస్తాయి.
ధనుస్సు: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మకరం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు అధిగమిస్తారు.
కుంభం: ఆర్థిక ఇబ్బందులు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
మీనం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.