గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: బ.పంచమి ఉ.10.22 వరకు, తదుపరి షష్ఠి,నక్షత్రం: పుబ్బ సా.4.26 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: రా.11.52 నుండి 1.32 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.17 నుండి 11.01 వరకు తదుపరి ప.2.41 నుండి 3.25 వరకు, అమృత ఘడియలు: ఉ.9.54 నుండి 11.03 వరకు.
సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం : 5.36
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం.. కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
వృషభం... ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. కొన్ని కార్యాలు మధ్యలో వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ పరుస్తుంది.
మిథునం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. వాహసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు.
కర్కాటకం.... కార్యక్రమాలలో తొందరపాటు వద్దు. బంధువులతో విభేదిస్తారు. ఆస్తి వివాదాలు. స్వల్ప శారీరక రుగ్మతలు. వ్యాపార, ఉద్యోగాలలో ఇబ్బందులు.
సింహం.... వేడుకలకు హాజరవుతారు. పాతబాకీలు వసూలవుతాయి. అంచనాలు నిజమవుతాయి. ఆస్తిలాభం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య.... కార్యక్రమాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కళాకారులకు చిక్కులు.
తుల.... నూతన ఉద్యోగప్రాప్తి. సమాజంలో మరింత గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి స్నేహితుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.
వృశ్చికం... సోదరులు, సోదరులతో సఖ్యత. యత్నకార్యసిద్ధి. అందరిలోనూ గౌరవం పొందుతారు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
ధనుస్సు.... రుణయత్నాలు. ఆలోచనలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వృథా ఖర్చులు. వ్యాపార, ఉద్యోగాలలో లేనిపోని చిక్కులు. దైవకార్యాలు చేపడతారు.
మకరం... కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. దేవాలయ దర్శనాలు. ఆస్తి వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
కుంభం.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. శుభవార్తలు. వాహనసౌఖ్యం. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. పాతబాకీలు వసూలవుతాయి.
మీనం.... దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. దైవకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.


