గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: బ.చవితి ఉ.10.44 వరకు తదుపరి పంచమి, నక్షత్రం: మఖ సా.4.05 వరకు తదుపరి పుబ్బ, వర్జ్యం: రా.12.12 నుండి 1.49 వరకు, దుర్ముహూర్తం: ప.11.45 నుండి 12.29 వరకు,అమృత ఘడియలు: ప.1.40 నుండి 3.12 వరకు.
సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం : 5.36
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం... ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో వివాదాలు. శారీరక రుగ్మతలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
వృషభం.... బంధువర్గంతో తగాదాలు. ఖర్చులు. కార్యక్రమాలలో జాప్యం. ఆరోగ్య సమస్యలు. వృత్తులు, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. దూరప్రయాణాలు.
మిథునం..... కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం.. కీలక నిర్ణయాలు. నూతన ఒప్పందాలు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత అనుకూలత.
కర్కాటకం..... కార్యక్రమాలు ముందుకు సాగవు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. దైవారాధనలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు. వృత్తులు, వ్యాపారాలలో మార్పులు.
సింహం.... కొత్త ఉద్యోగాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. విలువైన వస్తువులు కొంటారు. వృత్తులు, వ్యాపారాలలో ప్రోత్సాహం. కళాకారులు, పరిశోధకుల ఆశలు నెరవేరతాయి.
కన్య..... శ్రమాధిక్యం. కార్యక్రమాలలో తొందరపాటు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. శారీరక రుగ్మతలు, వృత్తులు, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు.
తుల..... కార్యక్రమాలు సకాలంలో పూర్తి. చిన్ననాటి స్నేహితుల కలయిక. ఉద్యోగయత్నాలు అనుకూలం. వృత్తులు, వ్యాపారాలలో నూతనోత్సాహం. ఆకస్మిక ప్రయాణాలు.
వృశ్చికం... పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తులు, వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళాకారులకు చికాకులు.
ధనుస్సు.... ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో విభేదిస్తారు.వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం. విద్యార్థులకు గందరగోళం.
మకరం..... కుటుంబసభ్యులతో విభేదాలు. కొన్ని కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. శారీరక రుగ్మతలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.
కుంభం... ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. ఆస్తి వివాదాల పరిష్కారం. వేడుకలలో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చర్చలు సఫలం.
మీనం.... ప్రయత్నాలు సఫలం. చిన్ననాటి స్నేహితుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనసౌఖ్యం. రాజకీయవేత్తలకు వివాదాల నుంచి విముక్తి.


