సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రేపు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడతారని వైఎస్సార్‌సీపీ ఒక ప్రకటనలో తెలిపింది.
చంద్రబాబు మోసాలు, రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కొనసాగుతున్న కూటమి కక్ష రాజకీయాలు, అక్రమ కేసులు.. దాడులు, కూటమి కనుసన్నల్లో పోలీసుల వ్యవహార శైలి, భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ.. తదితర సమకాలీన రాజకీయ అంశాలపై వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.


