హిందూ యువతికి పెళ్లి చేసిన ముస్లిం | Muslim Couple Raises Hindu Girl Conducts Her Wedding as per Hindu Traditions | Sakshi
Sakshi News home page

హిందూ యువతికి పెళ్లి చేసిన ముస్లిం

Feb 23 2026 12:02 PM | Updated on Feb 23 2026 12:02 PM

Muslim Couple Raises Hindu Girl Conducts Her Wedding as per Hindu Traditions

చిత్తూరు: తన వద్ద పెరిగిన హిందూ యువతికి హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసి మనసుకు మత బేధం లేదని ఒక ముస్లిం నిరూపించాడు. మండలంలోని చౌడేపల్లిలో హేమలత అనే చిన్నారి తండ్రి మరణించగా తల్లి ఎక్కడికి వెళ్లిపోయింది. దీంతో ఆ చిన్నారిని షాబీనా, అబ్దుల్‌ బాషా దంపతులు చేరదీసి సొంత కూతురిలా పెంచి పెద్ద చేశారు. 

తమ శక్తి మేరకు చదివించారు. తగిన హిందూ వరుడిని చూసి ఆదివారం ఒక కల్యాణ మండపంలో హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా వివాహం జరిపించారు. రెండు మతాల పెద్దలు, స్థానికులు, బంధుమిత్రులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మత సామరస్యానికి ఈ వివాహం ఒక ఉదాహరణ అని కొనియాడారు. ఈ వివాహ వేడుక సామాజీక మాద్యమాల్లో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు షాబీనా, అబ్దుల్‌ బాషా దంపతులను అభినందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement