సాక్షి, తిరుమల: తిరుమలలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తిరుమల క్యూలైన్ వద్ద పాము కలకలం రేగింది. ఈ క్రమంలో క్యూలైన్‌లో ఉన్న ఓ భక్తురాలిని పాము కాటు వేసింది. దీంతో, ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. తిరుమలలో రూ.300 టికెట్ క్యూలైన్‌లో నిలుచున్న ఓ భక్తురాలిని పాము కాటు వేసింది. దీంతో, ఆమెను స్థానిక స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం సదరు మహిళా భక్తురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. బాధితురాలిని తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన మౌనిక(27)గా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


