మెలకువలే విజయ సోపానం
టెన్త్ పరీక్షలకు మూడు వారాలే గడువు కీలక పాయింట్లు రాస్తేనే ఉత్తమ మార్కులు ఒత్తిడిని అధిగమిస్తేనే మంచి ఫలితాలు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల సూచనలు
●
తిరుపతి అర్బన్: ప్రతి విద్యార్థికి చిరస్థాయిగా గుర్తుండే మార్కులు టెన్త్ క్లాస్‌లో వచ్చేవి. పదోతరగతి అనేది విద్యార్థి జీవితంలో కీలక ఘట్టం. ఈ ఫలితమే చాలావరకు వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో టెన్త్‌లో ఉత్తమ మార్కులు సాధించేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున కుస్తీ పడుతున్నారు. మార్చి 16వ తేదీ నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు పలుజాగ్రత్తలు తీసుకోవాలని సబ్జెక్టు ఉపాధ్యాయులు పదేపదే సూచనలు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లా నుంచి 27,005 మంది పదో తరగతి పరీక్షలకు హాజరవుతుండగా వీరిలో 15,455 మంది విద్యార్థులు ప్రభు త్వ పాఠశాలల నుంచి, 11,548 మంది ప్రైవేటు పాఠశాలల నుంచి పరీక్షలు రాయనున్నారు. ఈ విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా నిపుణులైన ఉపాధ్యాయులు పలు సూచనలు ఇలా చేస్తున్నారు.


