కోడెగిత్తల జోరు | - | Sakshi
Sakshi News home page

కోడెగిత్తల జోరు

Feb 23 2026 6:55 AM | Updated on Feb 23 2026 6:55 AM

కోడెగ

కోడెగిత్తల జోరు

చంద్రగిరి: నియోజకవర్గం కేంద్రంలో ఆదివారం పశువుల పందాలను శ్రీమిట్టమీద గంగమ్మ ఆలయం ఆధ్వర్యంలో నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. ఐదు వేల మందికి పైగా ప్రజలు పశువుల పందాలను వీక్షించేందుకు రావడంతో మేడలు, మిద్దెలు నిండిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మండుటెండలో పరుగులు తీసే పశువులను వీక్షించేందుకు ఆసక్తిగా వేచి చూశారు. పశువుల పందాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ సీపీ శ్రేణలు తమ సత్తా చాటేందుకు తరలివచ్చారు. 150కి పైగా పశువులను వదిలి తమ అభిమాన నాయకుల సత్తాను చాటారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌, చిత్రపటాలతోపాటు పలకలను ఆయన అభిమానులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. పశువులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు యువత పోటీ పడడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. పశువుల పందాల సందర్భంగా వైఎస్‌ఆర్‌ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి ఆదేశాలతో ఆ పార్టీ నేతలు ప్రజలకు వాటర్‌ బాటిళ్లను పంపిణీ చేశారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్‌ రెడ్డితో కలసి ఈ మేరకు ప్రజలకు అందజేశారు. మూడు వేల వాటర్‌ బాటిళ్లను పంపిణీ చేశారు. నియోజకవర్గ యూత్‌ అధ్యక్షుడు కుప్పిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు వినోద్‌, ఒంటి శివ, బుల్లెట్‌ చంద్రమౌళిరెడ్డి, దెయ్యాల మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తపై దాడి

పశువుల పందాల సందర్భంగా వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. తిరుపతి రూరల్‌ మండలం మల్లవరానికి చెందిన వాసు రెడ్డి పశువుల పందేరాలలో తన ఎద్దును బరిలోకి దింపాడు. ఈ క్రమంలో తన ఎద్దును టీడీపీ కార్యకర్తలు నిలువరించడంతోపాటు మద్యం మత్తులో వాసురెడ్డిపై దాడికి తెగబడ్డారు. కత్తితో దాడి చేయడంతో వాసుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సహచరులు ఆయన్ను తిరుపతి రుయాకు తరలించారు.

కోడెగిత్తల జోరు1
1/2

కోడెగిత్తల జోరు

కోడెగిత్తల జోరు2
2/2

కోడెగిత్తల జోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement