రిటైర్డ్‌ ఉపాధ్యాయుల రాష్ట్ర కమిటీ | - | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ ఉపాధ్యాయుల రాష్ట్ర కమిటీ

Feb 23 2026 6:55 AM | Updated on Feb 23 2026 6:55 AM

రిటైర్డ్‌ ఉపాధ్యాయుల రాష్ట్ర కమిటీ

రిటైర్డ్‌ ఉపాధ్యాయుల రాష్ట్ర కమిటీ

తిరుపతి అర్బన్‌: రిటైర్డ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయిలో ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం తిరుపతి కొర్లగుంటలోని ఓ పాఠశాలలో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రిటైర్డ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీఆర్‌టీఎఫ్‌)ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి హాజరయ్యా. ఏపీటీఎఫ్‌ సీనియర్‌ నాయకుడు ఆనంద నాయుడు అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయ ప్రగతి ప్రధాన సంపాదకుడు సత్యనారాయణ, ఐఫియా చీఫ్‌ ప్యాట్రాన్‌ సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎంచుకున్నారు. ఏపీఆర్‌టీఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌గా సదాశివరావు(విజయనగరం), కోకన్వీనర్‌గా చంగల్రాయ మందడి (చిత్తూరు), సభ్యులుగా ఏ.ఎస్‌ నాయుడు(విశాఖపట్నం) ఎం.వి.ప్రసాదరావు(గుంటూరు), బి.తిరుపతిరెడ్డి(నెల్లూరు), పీవీ సుబ్బారావు (ప్రకాశం), ఎస్‌.ఎడ్విన్‌ జార్జి(అనంతపురం) ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement