ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం 27న ధర్నా | PDSU calls for protest on February 27 over pending scholarships and fee reimbursements AP | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం 27న ధర్నా

Feb 23 2026 6:12 AM | Updated on Feb 23 2026 6:12 AM

PDSU calls for protest on February 27 over pending scholarships and fee reimbursements AP

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న పీడీఎస్‌యూ నేతలు

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఈ నెల 27న విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్, కార్యదర్శి ఐ.రాజేష్‌ తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ధర్నా వాల్‌పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌íÙప్‌ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి లోకేశ్‌ బడ్జెట్‌లో ఉన్నత విద్యకు కేవలం 0.77 శాతం నిధులు కేటాయించడం దుర్మార్గమన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం 27న చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement