టీటీడీకి 658.. ప్రజలకు 560.. కల్తీ అమ్ముతున్నారా?: ఇందాపూర్‌పై బొత్స ప్రశ్న | YSRCP MLCs Protest In AP Assembly After Council Chairman Rejects Adjournment Motion On Indapur Dairy Issue, Check Updates Inside | Sakshi
Sakshi News home page

టీటీడీకి 658.. ప్రజలకు 560.. కల్తీ అమ్ముతున్నారా?: ఇందాపూర్‌పై బొత్స ప్రశ్న

Feb 23 2026 10:14 AM | Updated on Feb 23 2026 3:16 PM

YSRCP MLCs Protest In AP Assembly

శాసన మండలి అప్‌డేట్స్‌..

శాసనమండలి మీడియా పాయింట్

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్‌..

  • మండలిలో జరుగుతున్న విధానాలు సభ్యుల హక్కులు హరించేలా ఉన్నాయి
  • ప్రభుత్వ అనుకూల వీడియోలు మాత్రమే బయటికి వస్తున్నాయి
  • మొత్తం వీడియో ఫుటేజ్‌ను బయటికి విడుదల చేయాలి
  • మేం పోడియం వద్ద ఉన్న ఫుటేజ్ మాత్రం ఇవ్వడం లేదు
  • ప్రభుత్వానికి కావాల్సిన ఫుటేజ్‌ను వాళ్ల పేపర్లలో వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నవి మాత్రమే ఇచ్చారు
  • ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫుటేజ్ కావాలని అడిగినా స్పందించలేదు
  • ప్రజల హక్కులు కాపాడాలనేది మా ప్రయత్నం
  • ప్రజల హక్కులను కాలరాసే ప్రయత్నం ప్రభుత్వానిది.
  • దేవాలయంగా భావించే సెక్రటేరియట్‌కు బూట్లు వేసుకుని సీఎం శంకుస్థాపన చేశారు
  • చంద్రబాబు బూట్లు వేసుకుంటే తప్పులేదు..
  • మేం చెప్పులేసుకోవడం తప్పు అనేలా ప్రచారం చేస్తున్నారు
  • దేవుడికి పూజ చేసినప్పుడు కూడా చంద్రబాబు బూట్లు వేసుకున్నారు
  • మండలి ఛైర్మన్‌ను సెక్రటరీ ఏమాత్రం లెక్కచేయడం లేదు.

బొత్స చిట్‌చాట్‌..

  • ఇందాపూర్ ఫ్యూర్ నెయ్యి హైదరాబాద్ మార్కెట్‌లో 560 రూపాయలకు దొరుకుతుంది.
  • టీటీడీకి 658 రూపాయల చొప్పున ఇందాపూర్ నెయ్యి సరఫరా చేస్తున్నారు.
  • టీటీడీకి 658 రూపాయలకు అమ్మే నెయ్యి ప్యూర్ నెయ్యి అయితే బయట 560 రూపాయలకు దొరికే నెయ్యి కల్తీనా?.
  • ప్రజలకు కల్తీ నెయ్యి ఇస్తున్నారా?.
  • లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా? 

 

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్‌..

  • ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి టెండర్ల వెనుక నిజాలు వెలికి తీసుకురావాలనేది మా ప్రయత్నం
  • అందుకే మండలిలో మేం వాయిదా తీర్మానాలు కోరుతున్నాం
  • మేం చెప్పులతో స్వామివారి ఫొటోలు పట్టుకుని పోడియం వద్ద గొడవ చేశారని ప్రచారం చేస్తున్నారు
  • ఎవరు వేంకటేశ్వరస్వామికి అపచారం చేస్తున్నారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి
  • మేం చెప్పులు విడిచిన తర్వాతే పోడియం వద్ద నిరసన చేపట్టాం
  • చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని మేం దేవుడి ఫొటోలతో నిరసన చేపట్టాం
  • మేం మండలి నుంచి బయటికి రాకుండానే మా ఫొటోలు బయటికి వచ్చాయి
  • సాక్షాత్తూ చంద్రబాబు వినుకొండ సభలో మా గురించి ప్రస్తావించారు
  • తిరుపతి లడ్డూ కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన అంశం
  • మేం ఎక్కడా తిరుపతి లడ్డూని రాజకీయాల కోసం వాడుకోలేదు
  • మాపై బురద జల్లడం కోసం శాసనమండలిని వాడుకున్నారు
  • మొత్తం వీడియో ఫుటేజ్‌ను బయటికి ఇవ్వాలని శాసనమండలి చైర్మన్‌ను కోరాం
  • మేం ఏనాడూ వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడలేదు
  • మండలి చైర్మన్ నిస్సహాయత వ్యక్తం చేశారు
  • శాసనమండలి అధికారాలకు కోత పెట్టడం బాధాకరం
  • బీఏసీ సమావేశంలో అన్ని అంశాలను చైర్మన్ చర్చిస్తామన్నారు
  • తప్పనిసరి పరిస్థితుల్లో మండలి చైర్మన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టాల్సి వచ్చింది
  • సభ్యుల హక్కులనే కాపాడలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది
  • సెక్రటరీ జనరల్ ను ఎక్కడి నుంచో ఐదు లక్షల వేతనానికి తెచ్చారు
  • ఎవరు ఏం అడిగినా ఆయన ఇవ్వడట..
  • రైటైర్డ్ అయిన తర్వాత కూడా ఐదు లక్షల జీతానికి పని చేసేవారిని దేశంలో ఎక్కడా చూడలేదు
  • ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే మండలిలో ఫుటేజ్ మొత్తం బయటపెట్టాలి
  • ఇందాపూర్ , తిరుపతి లడ్డూపై చర్చ జరపాలి
  • అధికారంలో ఉన్నాం మేం చెప్పేదే వినాలనే ధోరణి మానుకోకపోతే ప్రజల పక్షాన వారి గొంతుకై పోరాడుతాం

 

ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కామెంట్స్‌..

  • వేంకటేశ్వరస్వామిని నమ్మేవాళ్లే అయితే మొత్తం ఫుటేజ్‌ను బయటపెట్టండి
  • మాట్లాడే వారి వీడియోలు మాత్రమే రికార్డ్ చేశారని చెబుతున్నారు
  • మరి ఆ ఫొటోలు, వీడియోలు ఎలా వచ్చాయి
  • నేను చెప్పులు వేసుకుని పోడియం వద్దకు వెళ్లినట్లు నిరూపించండి
  • ఈ క్షణమే రాజీనామా చేస్తా
  • హౌస్ మొత్తం ప్రొసీడింగ్స్‌ను రికార్డ్ చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది
  • సభలో ప్రొసీడింగ్స్‌ కవరేజ్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడమేంటి?.
  • మీకు దమ్ముంటే మొత్తం ఫుటేజ్‌ను విడుదల చేయండి
  • లేకపోతే తప్పు చేశామని క్షమాపణ చెప్పండి.

 

ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కామెంట్స్‌..

  • శాసనమండలి చైర్మన్ ను ఈ ప్రభుత్వం గౌరవించడం లేదు
  • కేవలం దళితుడై నందునే మండలి చైర్మన్ ను గౌరవించడం లేదు
  • దళితుల పట్ల ఈ ప్రభుత్వం వివక్ష చూపుతోంది
  • చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇందాపూర్ తెరపైకి వస్తుంది

 

ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్‌..

  • ఇందాపూర్ పై చర్చ పెట్టాలని ఐదు రోజులుగా కోరుతున్నాం
  • మేం చెప్పులు విడిచిన తర్వాతే వేంకటేశ్వరస్వామి ఫొటోలతో పోడియం వద్దకు వెళ్లాం
  • దేవదేవుడంటే మాకు అమితమైన భక్తి
  • తిరుమల పవిత్రతను, వేంకటేశ్వరస్వామిని ప్రతిష్టను దెబ్బతీసింది చంద్రబాబు
  • లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం చేసింది చంద్రబాబు
  • మండలిలో మొత్తం ఫుటేజ్‌ను బయటపెట్టాలి
  • చంద్రబాబు తన సొంత మనుషులతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు
  • ఏకసభ్య కమిషన్ ద్వారా ఇందాపూర్ ,హెరిటేజ్ కు ఉన్న సంబంధాల పై విచారణ చేయించాలి
  • పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు

 

ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్‌..

  • ఇందాపూర్, హెరిటేజ్ పై చర్చ జరగాలని మేం అడుగుతున్నాం
  • కానీ చర్చ జరగనివ్వడం లేదు
  • అందుకే వేంకటేశ్వరస్వామి ఫొటోలతో మండలి చైర్మన్ వద్దకు వెళ్లాం
  • పోడియం వద్దకు మేం చెప్పులతో వెళ్లలేదు
  • మేం చెప్పులతో దేవుడి ఫొటోలతో చైర్మన్ వద్దకు వెళ్లామని తప్పుడు ప్రచారం చేశారు
  • మండలిలో ఫుటేజ్ ను మొత్తం బయటపెట్టాలని చైర్మన్ ను కోరాం
  • కానీ మేం మండలి నుంచి బయటికి రాకుండానే మార్ఫింగ్ ఫొటోలను ప్రచారం చేశారు
  • మాకు పూర్తి వీడియో ఫుటేజ్ ఇచ్చే వరకూ మేం పోరాటం చేస్తూనే ఉంటాం
  • దమ్ముంటే మండలిలోని పూర్తి వీడియో ఫుటేజ్ ను ప్రభుత్వం బయటపెట్టాలి

 

ఎమ్మెల్సీ, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్‌..

  • ఏపీలో శాంతిభద్రతలు లేవు
  • ప్రశ్నించే వారి ఇంటి పై దాడులు చేస్తామని నిస్సిగ్గుగా చెబుతున్నారు
  • ఎలాంటి ఆధారాలు లేకుండా లడ్డూ పై ప్రచారం చేసినందుకు చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదా
  • లడ్డూ కల్తీ జరిగిందంటూ ఫ్లెక్సీలు పెట్టినందుకు చంద్రబాబుకి ఏమీ అనిపించడం లేదా?
  • లడ్డూలో కల్తీ జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం చర్చకు భయపడుతుంది
  • మండలిలో చెప్పులు వేసుకుని మేం దేవుడి ఫొటోలతో పోడియం వద్ద నిరసన చేశామని ప్రచారం చేస్తున్నారు
  • శాసనమండలి సెక్రటరీ జనరల్ నియంతలా వ్యవహరిస్తున్నారు
  • మండలి చైర్మన్ కు కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదు
  • మా పై పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు

 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల కామెంట్స్‌..

  • దేవుడి చిత్రపటం చూసైనా చంద్రబాబు బుద్ధి మారుతుందేమో అనుకున్నాం.
  • అందరం చెప్పులు విడిచే స్వామివారి పటాలు పట్టుకున్నాం.
  • మా చేతిలోని దేవుడి చిత్ర పటాలు లాక్కొని బయటకు పంపించారు.
  • గతంలో టీడీపీ నేతలు చెప్పులతో పూజలు చేశారు.
  • చంద్రబాబు గతంలో చెప్పులతో రాజధానికి శంకుస్థాపన చేశారు.
  • తిరుమల లడ్డూ అంశాన్ని మేము రాజకీయ కోణంలో చూడటం లేదు.
  • ఏపీలో తిరుమల ఉందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం.
  • టీడీపీ నేతలు ఎడిటింగ్‌ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
  • టీటీడీకి ఇందాపూర్‌ నెయ్యి సరఫరాపై చర్చించాలని డిమాండ్‌ చేస్తున్నాం.
  • శుక్రవారం నాటి మండలి పూర్తి వీడియో బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం. 

 

👉 శాసనమండలి కాసేపు వాయిదా.. 

టీడీపీ ఎడిటింగ్‌ వీడియో విడుదలపై ఫిర్యాదు..

  • మండలి చైర్మన్‌ చాంబర్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ భేటీ.
  • శుక్రవారం నాటి మండలి ఫుటేజీని విడుదల చేయాలని ఆందోళన.
  • మొత్తం ఫుటేజీ విడుదల చేయాలని రమేష్‌ యాదవ్‌ ఫిర్యాదు.
  • టీడీపీ నేతలు ఎడిటింగ్‌ వీడియో విడుదల చేయడంపై ఫిర్యాదు.
  • ఎడిట్‌ వీడియో బయటకు ఎలా వచ్చిందో తేల్చాలని డిమాండ్‌.
  • ఫుటేజీ కోసం అసెంబ్లీ అధికారులను ఆదేశించిన చైర్మన్‌.
  • మొత్తం ఫుటేజీ లేదన్న అధికారుల సమాధానంపై ఆగ్రహం. 

 

మండలిలో చర్చ జరగాల్సిందే: బొత్స

  • తిరుపతి లడ్డు అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామన్న వ్యాఖ్యలపై స్పందించిన బొత్స
  • అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనేది మాకు అనవసరం.
  • మాకు మాత్రం మండలిలో చర్చ జరగాలి.
  • రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉంది
  • దేవదేవుడిపై నిండాపనిందలు రాకుండా ప్రభుత్వం చర్చకి రావాలి.

శాసనమండలిలో గందరగోళం

  • చైర్మన్ పోడియం వద్దకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు, కూటమి ఎమ్మెల్సీలు
  • నినాదాలు చేసిన ఇరుపక్షాలు
  • సభలో గందరగోళ పరిస్థితి..
  • సభకు కొద్ది సేపు విరామం ప్రకటించిన మండలి చైర్మన్
  • శాసన మండలి చైర్మన్‌తో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల సమావేశం
  • 11:30 గంటలకి బీఏసీ సమావేశం నిర్వహించనున్న చైర్మన్..
  • లడ్డూ అంశంపై మండలిలో చర్చించే విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం

👉 హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా వున్న ఇందాపూర్ డైయిరీ అంశంపై శాసన మండలిలో చర్చించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే, మరోసారి వైఎ‍స్సార్‌సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు.

👉 దీంతో, చర్చకు అనుమతించాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్‌ పోడియం వద్ద వైఎస్సార్‌సీపీ సభ్యుల నినాదాలు చేశారు. .వైఎస్సార్‌సీపీ సభ్యులకు పోటీగా చైర్మన్‌ పోడియం వద్దకు కూటమి ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మండలి వాయిదా పడింది. 

Advertisement
 
Advertisement
Advertisement