వీఏఏలపై పనిభారం..
రేషనలైజేషన్ పేరిట కత్తిపెట్టిన వైనం ఇప్పటికే మూతపడిన 60 రైతు సేవ కేంద్రాలు సిబ్బంది సైతం సర్దుబాటు అన్నదాతల అవస్థలు పట్టించుకోని ప్రభుత్వం
నిర్వీర్యం చేస్తున్నారు..
గతంలో బాగా పనిచేశాయి..
రైతు సేవలకు మంగళం పాడుతున్న చంద్రబాబు సర్కారు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వ్యవ‘సాయానికి’ చిరునామాగా ఉండి.. రైతులకు అన్ని విధాలా అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాల అడ్రస్ గల్లంతవుతోంది. రైతుల అవస్థలను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు కేంద్రాల పేరు మార్చి.. నిర్వీర్యం చేస్తోంది. రేషనలైజేషన్ పేరిట కత్తికట్టి, కేంద్రాలను కుదిస్తోంది. అన్నదాతలకు విత్తనం నుంచి విక్రయం వరకూ ఇబ్బందుల పాల్జేస్తోంది.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రైతులు తమ అవసరాలకు గ్రామం దాటి వెళ్లకూడదని, అన్ని సేవలు గ్రామంలోనే అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు(ఆర్‌బీకేలు) ప్రారంభించింది. విత్తనం నుంచి పంట విక్రయం వరకు సేవలు ఆర్బీకేలలో లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఒక్కో ఆర్బీకేలో వ్యవసాయ సహాయకుడు, ఉద్యాన సహాయకుడు, వెటర్నరీ సహాయకుడు ఇలా సిబ్బందిని నియమించింది. సిబ్బంది ద్వారా వ్యవసాయదారులకు సూచనలు, సలహాలు, భూ సార పరీక్షలు, ఈ–క్రాప్ నమోదు చేయడం ద్వారా పంటలకు బీమా సౌకర్యం కల్పించడం వంటి సేవలను అందించింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచింది. పంటలు వాటి మద్ధతు ధరల వివరాలు డిస్ ప్లే చేసింది. రైతులు పండించిన పంటలు కొనుగోలు మద్ధతు ధరలకు కొనుగోలు చేసేలా నాటి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యవసాయానికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులోకి తెచ్చింది. ఆ ఐదేళ్లు ఆర్బీకేలు రైతులతో కళకళలాడాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసింది. ఇదంతా గతం.
ఇప్పుడు అధ్వానం..
తాము అధికారంలోకి వస్తే రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని నమ్మబలికి చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి 20 నెలలు పూర్తయింది. గత ప్రభుత్వం విప్లవాత్మకంగా తీసుకొచ్చిన ఆర్బీకేలను రైతు సేవా కేంద్రాలు(ఆర్ ఎస్‌కే)గా పేర్లు మార్చింది. రేషనలైజేషన్ పేరుతో రైతు సేవా కేంద్రాలను కుదించింది. జిల్లాలో మొత్తం 60 కేంద్రాలకు తాళాలు వేసింది. రెండు, మూడు కేంద్రాలను కలిపి ఒకటిగా చేసింది. సిబ్బందిని సర్దుబాటు చేసింది. మిగిలిన పోయిన ఆర్బీకేల నిర్మాణం పూర్తి చేయకపోగా ఉన్నవాటికే తాళం వేసింది. ఆయా చోట్ల రైతులకు సూచనలు, సలహాలు ఇలా సేవలన్నింటికి స్వస్తి పలికింది. ఫలితంగా వ్యవసాయం తిరోగమనంలోకి వెళుతోంది. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా ఎగనామం పెట్టింది. ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదు. ఆర్‌ఎస్‌కేలలో గిట్టుబాటు ధరల సమాచారమే అందుబాటులో లేదు. లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. వాటిని ప్రారంభించి సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయడం లేదు. మొత్తంగా రైతు సేవా కేంద్రాలు వెలవెలబోతున్నాయి.
267
మొత్తం రైతు భరోసా కేంద్రాలు
207
మొత్తం
సిబ్బంది
207
రేషనలైజేషన్ తర్వాత
మిగిలినవి
75
అసలు ప్రారంభం కానివి
ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి
98
భవన నిర్మాణాలు పూర్తయినవి
20
నిర్మాణం పూర్తయి ప్రారంభం కాని
భవనాలు
రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం పూర్తి గా నిర్వీర్యం చేస్తోంది. గ్రామాల్లో రైతులకు సాగు విషయంలో వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడేది. ప్రస్తుతం ఆర్‌బీకేలలో పని చేసే అగ్రికల్చర్, హార్టీకల్చర్ అసిస్టెంట్లకు ఇతర పనులు అప్పగించడంతో గ్రామాల్లో పూర్తిగా వ్యవసాయ సమాచారం ఇచ్చేవారే కరువయ్యారు.
– ఉన్నం శ్రీనివాసరావు, రైతు, అనిగండ్లపాడు, పెనుగంచిప్రోలు మండలం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్‌బీకేల ద్వారా ఎరువులు, పురుగు మందులు అందించేవారు. అంతే కాకుండా పంటల రైతు భరోసా, పంట నష్ట పరిహారాలు కూడా సకాలంలో అందేవి. ఈ–క్రాప్ నమోదు చేసి పంటల బీమా కల్పించారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. చాలా ఇబ్బందిగా ఉంది.
– కొండబోలు శ్రీను, రైతు, మక్కపేట,
వత్సవాయి మండలం
ఒక్కో ఆర్‌ఎస్‌కేలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్(వీఏఏ) అందుబాటులో ఉండేవారు. ప్రారంభంలో జనాభా ప్రాతిపదికన వీఏఏల నియామకం జరిగింది. ఇపుడు రేషనలైజేషన్ పేరుతో పంట సాగు విస్తీర్ణం ఆధారంగా వీఏఏలను సర్దుబాటు చేశారు. రెండుమూడు ఆర్‌ఎస్‌కేలను విలీనం చేయడంతో ఆ భారమంతా ఒక వీఏఏపై పడుతోంది. ఈ–క్రాప్ నమోదు, వ్యవసాయ సంబంధిత విధులే కాకుండా ఇతర సర్వేలు కూడా చేయిస్తుండటంతో వారిపై భారం పడుతోంది. ఉద్యాన సహాయకులైతే ఒక్కో మండలంలో మూడు గ్రామాలకు ఒకరు చొప్పున ఉండటంతో ఒత్తిడికి గురవుతున్నారు. రాబోయే రోజుల్లో ఆర్‌ఎస్‌కేలను ఉంచుతుందా లేదా అన్న ఆందోళనలో వారు ఉన్నారు.
వీఏఏలపై పనిభారం..
వీఏఏలపై పనిభారం..
వీఏఏలపై పనిభారం..
వీఏఏలపై పనిభారం..


