తిరుమల నిత్యాన్నదానానికి పది టన్నుల కూరగాయలు | - | Sakshi
Sakshi News home page

తిరుమల నిత్యాన్నదానానికి పది టన్నుల కూరగాయలు

Feb 23 2026 8:51 AM | Updated on Feb 23 2026 8:51 AM

తిరుమ

తిరుమల నిత్యాన్నదానానికి పది టన్నుల కూరగాయలు

తిరుమల నిత్యాన్నదానానికి పది టన్నుల కూరగాయలు టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ జిల్లా జట్టు ఎంపిక

లబ్బీపేట(విజయవాడతూర్పు): తిరుమల శ్రీవారి సన్నిధిలో నిర్వహించే నిత్యాన్నదానానికి ఐసీఏఐ విజయవాడ చాప్టర్‌ ఆధ్వర్యంలో పది టన్నుల కూరగాయలను పంపించారు. కాగా కూరగాయల వాహనాన్ని ఆదివారం గవర్నర్‌ పేటలోని ఆ సంస్థ కార్యాలయం వద్ద ఐసీఏఐ విజయవాడ చాప్టర్‌ అధ్యక్షుడు డి. ప్రసన్నకుమార్‌, ఇతర సభ్యులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవను సుస్థిరతతో అనుసంధానిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. చైర్మన్‌ జయంత్‌ ఉప్పులూరి, ఆక్స్‌ ఆఫిషియో సభ్యుడు ముప్పాల సుబ్బారావు వేమూరు వీర పావన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

గన్నవరం: స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్‌ క్రీడా ప్రాంగణంలో ఆదివారం సీనియర్‌ పురుషుల కృష్ణాజిల్లా టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ జట్టు ఎంపికలు నిర్వహించారు. ఈ సెలక్షన్స్‌కు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 14 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లుగా ఆ సంఘ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఎం. నరేంద్రబాబు చెప్పారు. మరో నలుగురు క్రీడాకారులను స్టాండ్‌బైగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు మార్చి 7వ తేదీన ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు. వ్యాయామ ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

తిరుమల నిత్యాన్నదానానికి పది టన్నుల కూరగాయలు 1
1/1

తిరుమల నిత్యాన్నదానానికి పది టన్నుల కూరగాయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement