సాధారణంగా చేప అంటే.. ఓ బారెడు లేదా మూరెడు లేదా అంతకంటే కొంచె ఎక్కువ. కానీ 243 కిలోల భారీ చేపగురించి విన్నారా? సుమారుగా ఒక బైక్ పరిమాణం, బరువు ఉంది. దీంతో ఈ చేప రూ. 28 కోట్లకు పైగా ధరకు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. అందుకే ఈ చేప ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. దీని పేరు బ్లూఫిన్ ట్యూనా చేప.
చరిత్రలోనే అత్యంత ఖరీదైన ట్యూనా (Tuna) చేపగా నిలిచింది. టోక్యోలోని టోయోసు చేపల మార్కెట్‌లో జరిగిన వార్షిక నూతన సంవత్సర వేలంలో రికార్డు స్థాయిలో 510.3 మిలియన్ యెన్‌లకు (సుమారు రూ. 28.7 కోట్లు) అమ్ముడుపోయింది. ఈ వేలంలో విజేతగా నిలిచి వ్యక్తి సుషీ చైన్ యజమాని కియోషి కిమురా. ఈ వేలాన్ని గెల్చుకోవడం ద్వారా 2019లో స్వయంగా తాను నెలకొల్పిన తన సొంత రికార్డును బద్దలు కొట్టారు. అప్పుడు ఆయన 278 కిలోల ట్యూనా కోసం సుమారు రూ. 17 కోట్లు చెల్లించారు. అందుకే కిమురా జపాన్‌లో "ట్యూనా రాజు"గా ప్రసిద్ధి చెందారు. ఈ చేపను తన రెస్టారెంట్లలో వడ్డించిన తర్వాత, కిలోకు రూ. 11 లక్షల వరకు అమ్ముడవుతుందని అంచనా వేస్తున్నారు.
కియోమురా కార్ప్ కింద సుషీ జాన్మాయ్ రెస్టారెంట్ గొలుసును నడుపుతున్న కిమురా, ఈ విలువైన చేపను దక్కించుకోవడానికి తన ప్రత్యర్థులను అధిగమించి వేలంలో దీన్ని దక్కించుకున్నాడు. వేలం తర్వాత కిమురా మాట్లాడుతూ: “ఇది నా అదృష్టం. మంచిగా కనిపించే ట్యూనా చేపను చూసినప్పుడు, దాన్ని కొనకుండా ఉండలేను. నేను ఇంకా దానిని రుచి చూడలేదు, కానీ ఖచ్చితంగా రుచికరంగా ఉంటుంది." అన్నాడు.

బ్లూఫిన్ ట్యూనా గొప్ప ఏంటి?
జపాన్‌లో, బ్లూఫిన్ ట్యూనాను హోదాకు, ప్రతిష్టకు చిహ్నంగా పరిగణిస్తారు, దీనిని తరచుగా ఉన్నత వర్గాల వినియోగదారుల కోసం కేటాయిస్తారు. ఫిష్ సొసైటీ ప్రకారం, ఇది దేశ వంటల సంస్కృతిలో అత్యంత కోరబడే రుచికరమైన వంటకాలలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ రికార్డు ఈ ట్యూనాను అమోరి ప్రిఫెక్చర్‌లోని ఓమా తీరంలో పట్టుకున్నారని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ఈ ప్రాంతం జపాన్‌లోని అత్యుత్తమ చేపలను ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందింది. ఓమా నుండి వచ్చే ట్యూనాకు స్థిరంగా అధిక ధరలు లభిస్తాయి, ఎందుకంటే ఆ ప్రాంతంలోని చల్లని మరియు వెచ్చని ప్రవాహాల ప్రత్యేక సమ్మేళనం ప్రీమియం-నాణ్యత సముద్రపు ఆహారాన్ని పెంచుతుంది. (స్కూలు నుంచి గెంటేశారు.. కట్ చేస్తే తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్)



