
సింగపూర్‌లోని విమానాశ్రయంలో లగ్జరీ వస్తువులను దొంగిలిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ఒక అమెరికన్ జంట పట్టుబడింది. పైగా వీరిద్దరూ మామూలు సిటిజన్స్‌కాదు, ఇద్దరూ గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నవారు. కానీ కక్కుర్తి పడ్డారు అదీ కఠినమైన చట్టాలు, జీరో టోలరెన్స్ నియమాలకు పెట్టింది పూరైన సింగపూర్ విమానాశ్రయంలో. చివరకు పోలీసులక చిక్కి కటాకటాల ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
కపాడియా హుస్సేన్ జోహెర్ (35), కపాడియా అమతుల్లా (30) ఇద్దరూ భార్యాభర్తలు. జోహెర్ దంతవైద్యుడిగా పనిచేస్తుండగా, అమతుల్లా ఇంజీనీర్‌గా ఉన్నారు. ఈ జంట సింగపూర్ విమానాశ్రయంలో విలాసవంతమైన వస్తువులను దొంగిలిస్తూ దొరికి పోయారు. అమెరికా జాతీయులైన ఈ జంట జూన్ 23న చాంగి విమానాశ్రయంలోని చాంగి విమానాశ్రయం టెర్మినల్ 1లోకి ప్రవేశించిన తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చోరీకి పాల్పడ్డారు. భారతదేశానికి కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కడానికి ముందు విమానాశ్రయంలో లూయిస్ విట్టన్ అండ్ డియోర్ నుండి 750 డాలర్లు (సుమారు రూ.65,790) ఎక్కువ విలువైన వస్తువులను దొంగిలించారని పోలీసుఅధికారులు తెలిపారు. విమానాశ్రయం లోపల ఉన్న సీసీటీవీ ఆధారంగా ఇద్దరిని విచారించి దొంగతనం చేసిన అధికారులు జైలు శిక్ష ఖరారు చేశారు. జొహెర్‌కు 18 రోజుల జైలు , అతని భార్యఅమతుల్లాకు వారం రోజుల జైలు శిక్ష విధించారు.
చదవండి: 5 నెలల్లో 28 కిలోలు : అమీర్ ఖాన్ అద్భుత చిట్కాలు
600 డాలర్ల విలువైన క్రెడిట్ కార్డ్ హోల్డర్‌ను, ది షిల్లా బ్రాండ్ కాస్మెటిక్స్ & పెర్ఫ్యూమ్స్ షాపులో డియోర్ సావేజ్ పెర్ఫ్యూమ్ బాటిల్‌ను జేబులో వేసుకున్నాడు. డబ్బు చెల్లించకుండా దుకాణం నుండి వెళ్లిపోయాడు. తన చోరీని ఎవరు చూడకుండా ఉండేందుకు భార్యను కాపాలాగా ఉంచాడు. తమ పని కానిచ్చి, ఏమీ తెలియనట్టు ముంబై విమానం ఎక్కి కామ్‌గా కూర్చుకున్నారు. కానీ పోలీసులకు చిక్కక తప్పలేదు. విమానం టేకాఫ్‌కు ముందే పోలీసులు వారిని అరెస్ట్ చేయడం విశేషం. జోహెర్ ఎక్కువ ఖర్చు చేసే అలవాటు ఉందనీ, దురాశతో దొంగతనం చేశాడని ప్రాసిక్యూటర్ తెలిపారు. దొంగిలించబడిన రెండు వస్తువులను స్వాధీనం చేసుకుని సంబంధిత దుకాణాలకు తిరిగి ఇచ్చారు.
కాగా సింగపూర్‌లోచట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కఠినమైన చట్టాల కారణంగా సింగపూర్ ప్రపంచంలోనే అత్యల్ప నేరాల రేటు కలిగిన దేశాలలో ఒకటి. చూయింగ్ గమ్, ఇ-సిగరెట్లు, పబ్లిక్ టాయిలెట్‌ను ఫ్లష్ చేయకపోవడం లాంటివి కూడా ఇక్కడ నేరంగా పరిగణిస్తారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వారికి సుదీర్ఘ జైలు శిక్ష, 24 కొరడా దెబ్బలు శిక్ష అనుభవించాలి. చట్టవిరుద్ధమైన పదార్థాలను విక్రయించే ఎవరికైనా ఇక్క మరణశిక్ష తప్పదు.
ఇదీ చదవండి: Sravana Sukravaram: ‘శ్రావణ లక్ష్మీ రావే మా ఇంటికి’... సెల్ఫీ షేర్ చేయండి!