వాషింగ్టన్: అమెరికా కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో భారీ విద్యుత్ అంతరాయం చోటుచేసుకుంది. డిసెంబర్ 20న జరిగిన ఈ ఘటనలో 1,30,000 ఇళ్లకు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగరంలోని రిచ్‌మండ్, ప్రెసిడియో, గోల్డెన్ గేట్ పార్క్ పరిసరాల్లో అంధకారం నెలకొంది.
ఈ విద్యుత్ అంతరాయం PG&E కంపెనీ వినియోగదారులలో మూడో వంతు మందిని ప్రభావితం చేసింది.రెస్టారెంట్లు, షాపులు మూతపడ్డాయి. వీధి దీపాలు, క్రిస్మస్ అలంకరణలు ఆరిపోయాయి. దీంతో తాము కరెంట్ కోతతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు,ఫొటోల్ని షేర్ చేస్తున్నారు.
నగరవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. బస్టాండ్,రైల్వేస్టేష్టన్లు కార్యకాలపాలు ఆగిపోయాయి.ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అత్యవసర ప్రయాణాలు తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు
8వ స్ట్రీట్ సమీపంలో ఉన్న పీజీ అండ్ ఈ సబ్ స్టేషన్‌లో మంటలు చెలరేగడంతో కొంత భాగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అగ్నిమాపక శాఖ తెలిపింది.సాయంత్రం 4గంటలకు సమస్యల్ని నివారించినట్లు విద్యుత్‌శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, విద్యుత్ పూర్తిగా ఎప్పుడు పునరుద్ధరిస్తామోనన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు.


