తులసి గబ్బార్డ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు | Tulsi Gabbard warns Islamist ideology | Sakshi
Sakshi News home page

తులసి గబ్బార్డ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Dec 22 2025 1:18 AM | Updated on Dec 22 2025 2:20 AM

Tulsi Gabbard warns Islamist ideology

వాషింగ్టన్‌: తులసి గబ్బార్డ్‌.. ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేని పేరు. ట్రంప్‌ ప్రభుత్వంలో నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ అధిపతిగా కొనసాగుతున్న ఆమె వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు. తాజాగా,‘ఇస్లామిక్ సిద్ధాంతం అమెరికా ప్రజాస్వామ్యానికి విరుద్ధం’అంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. 

AmFest 2025 పేరుతో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఇటీవల పలు దేశాల్లో జరిగిన ఉగ్రదాడులపై ఘాటుగా స్పందించారు. ఇస్లామిక్ సిద్ధాంతం అమెరికా ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అందుకే చట్టపరమైన, రాజకీయ వ్యవస్థల ద్వారా ఇస్లామిక్ సూత్రాలను అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆమె ఈ సందర్భంగా.. న్యూ జెర్సీ నగరాన్ని మొదటి ముస్లిం నగరంగా పేర్కొన్నారు. 

అక్కడ ఇస్లామిక్ సిద్ధాంతాలను చట్టాల ద్వారా,లేదంటే బలవంతంగా అమలు చేస్తున్నారు. ఇది కేవలం భవిష్యత్తులో జరుగుతుందని అనుకుంటే పొరబడినట్లే. ఇప్పటికే అమెరికా సరిహద్దులలో జరుగుతోంది. హ్యూస్టన్ వంటి నగరాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇస్లామిజం అనేది వ్యక్తిగత స్వేచ్ఛను తిరస్కరించే రాజకీయ సిద్ధాంతం.

ఇస్లామిజం ఉన్నచోట వ్యక్తిగత స్వేచ్ఛ లేదా స్వాతంత్ర్యం ఉండదు. ఇది అమెరికా స్వేచ్ఛా వ్యవస్థకు పూర్తిగా విరుద్ధం. అమెరికా వ్యవస్థ దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ అనే నమ్మకంపై ఆధారపడి ఉందని, ఇస్లామిక్ సిద్ధాంతాలు ఈ మూల సూత్రాన్ని విస్మరిస్తాయని పునరుద్ఘాటించారు. 

అయితే,ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ, మతపరమైన వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికార రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు తులసి గబ్బార్డ్‌ చేసిన వ్యాఖ్యల్ని స్వాగతించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement