పాక్‌కు షాకిచ్చిన అమెరికా..! | Pakistan In Shock As US Official Handle Recognises Jammu And Kashmir As Part Of India, Check Out Post Inside | Sakshi
Sakshi News home page

పాక్‌కు షాకిచ్చిన అమెరికా..!

Feb 7 2026 11:59 AM | Updated on Feb 7 2026 5:39 PM

Washingtons Kashmir Message To Pakistan after India US Trade Framework

దాయాది పాకిస్తాన్‌.. గత కొన్ని రోజులుగా అమెరికా అండ చూసుకుని తెగ వయ్యారాలు పోయింది. కొన్ని నెలలుగా భారత్‌-అమెరికాల మధ్య నెలకొన్న అనిశ్చిత కారణంగా పాకిస్తాన్‌ బిల్డప్‌లు మీద బిల్డప్‌లు ఇచ్చేసింది. ఆ దేశ ఆర్మీ చీఫ్‌ మునీర్‌తో పాటు ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌లకు ఒకటి రెండు సందర్భాల్లో అమెరికా ఆహ్వానం పలకడంతో వారి వేషాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తమతో అమెరికా బంధం శాశ్వతమైనది అన్నంతగా ఓవరాక్షన్‌ చేసింది పాకిస్తాన్‌. 

ఈ క్రమంలోనే అమెరికా చెప్పిన ప్రతీ విషయానికి ఊ కొట్టింది పాక్‌. అయితే పాకిస్తాన్‌ను మింగుడు పడని విషయం తాజాగా చోటు చేసుకుంది. ఒకటి భారత్‌తో అమెరికా డీల్‌ ఒకటైతే, మరొకటి జమ్మూ-కశ్మీర్‌ మొత్తం భాగం అనేది ఎప్పటికీ భారత్‌దే అని ప్రపంచానికి తెలిసేలా అమెరికా ట్వీట్‌ చేసింది. భారత్‌-అమెరికాల ట్రేడ్‌ డీల్‌ కుదిరిన గంటల వ్యవధిలోనే భారత్‌ మ్యాప్‌ను అమెరికా పోస్ట్‌ చేసింది. ఇందులో కశ్మీర్‌ను భారత్‌ మ్యాప్‌లోనే ఉంచి మరీ పోస్ట్‌ పెట్టింది. 

యూఎస్‌ అధికారిక ‘X ’ హ్యాండిల్‌లో భారత్‌ మ్యాప్‌ పోస్ట్‌ పెట్టింది. ఆ మ్యాప్‌లో జమ్మూ & కశ్మీర్, లడఖ్, అలాగే పీఓకే(POK) భారత్‌‌లో భాగంగా చూపబడింది. ఫలితంగా భారత్‌ యొక్క మ్యాప్‌ను అమెరికా అంగీకరిస్తుందనే సంకేతాలిచ్చింది. అదే సమయంలో పాకిస్తాన్‌ చేస్తున్న‌ ‘కశ్మీర్‌పై హక్కు’ అనే వాదనను తిరస్కరిస్తోందని స్పష్టమైన సందేశం ఇచ్చింది. దాంతో పాకిస్తాన్‌ గట్టి షాక్‌ తగిలింది,. 

పాకిస్తాన్‌కు అమెరికా బిగ్ షాక్ POK భారత్‌లో అంతర్భాగమే..

 

ఇవీ చదవండి:

ఇది భారత్‌ వ్యూహాత్మక ముందడుగేనా?

ట్రంప్‌ సుంకాలు: భారత్‌కు భారీ ఊరట

Advertisement
 
Advertisement
Advertisement