breaking news
Islamist groups
-
తులసి గబ్బార్డ్ వివాదాస్పద వ్యాఖ్యలు
వాషింగ్టన్: తులసి గబ్బార్డ్.. ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేని పేరు. ట్రంప్ ప్రభుత్వంలో నేషనల్ ఇంటెలిజెన్స్ అధిపతిగా కొనసాగుతున్న ఆమె వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. తాజాగా,‘ఇస్లామిక్ సిద్ధాంతం అమెరికా ప్రజాస్వామ్యానికి విరుద్ధం’అంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. AmFest 2025 పేరుతో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఇటీవల పలు దేశాల్లో జరిగిన ఉగ్రదాడులపై ఘాటుగా స్పందించారు. ఇస్లామిక్ సిద్ధాంతం అమెరికా ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అందుకే చట్టపరమైన, రాజకీయ వ్యవస్థల ద్వారా ఇస్లామిక్ సూత్రాలను అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆమె ఈ సందర్భంగా.. న్యూ జెర్సీ నగరాన్ని మొదటి ముస్లిం నగరంగా పేర్కొన్నారు. అక్కడ ఇస్లామిక్ సిద్ధాంతాలను చట్టాల ద్వారా,లేదంటే బలవంతంగా అమలు చేస్తున్నారు. ఇది కేవలం భవిష్యత్తులో జరుగుతుందని అనుకుంటే పొరబడినట్లే. ఇప్పటికే అమెరికా సరిహద్దులలో జరుగుతోంది. హ్యూస్టన్ వంటి నగరాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇస్లామిజం అనేది వ్యక్తిగత స్వేచ్ఛను తిరస్కరించే రాజకీయ సిద్ధాంతం.ఇస్లామిజం ఉన్నచోట వ్యక్తిగత స్వేచ్ఛ లేదా స్వాతంత్ర్యం ఉండదు. ఇది అమెరికా స్వేచ్ఛా వ్యవస్థకు పూర్తిగా విరుద్ధం. అమెరికా వ్యవస్థ దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ అనే నమ్మకంపై ఆధారపడి ఉందని, ఇస్లామిక్ సిద్ధాంతాలు ఈ మూల సూత్రాన్ని విస్మరిస్తాయని పునరుద్ఘాటించారు. అయితే,ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ, మతపరమైన వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికార రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు తులసి గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యల్ని స్వాగతించారు. -
పాక్‌కు పరారైన బంగ్లా ఉగ్రవాద గ్రూపు చీఫ్
ఢాకా: జమాత్-ఈ-ఇస్లామీ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్న ఇస్లామిక్ గ్రూపు అన్సరుల్లా బంగ్లా టీమ్ ఆపరేషన్స్ చీఫ్ దిదార్ హొస్సేన్ పాకిస్థాన్‌కు పరారయ్యాడని బంగ్లాదేశ్ పోలీసులు వెల్లడించారు. ఢాకాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం రాత్రి చేసిన దాడుల్లో ఈ సంస్థకు చెందిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. వీరిని ప్రాథమికంగా విచారించడంతో సంస్థ ఆపరేషన్స చీఫ్ హోస్సేన్ పాక్‌కు పరారైనట్లు వెల్లడైందని తెలిపారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు మదర్సా విద్యార్థి అని, మిగిలిన వారు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరంతా తమ సంస్థ ద్వారా ఆల్ ఖైదా భావాలను ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అన్సరుల్లా బంగ్లా టీమ్ ఇస్లాంకు శత్రువులుగా పేర్కొంటూ అనేక మంది ప్రముఖ నాయకులను హత్య చేసేందుకు కుట్ర పన్నిందని వెల్లడించారు. ఇద్దరు మంత్రులను హత్య చేసేందుకు సంబంధించిన పత్రాలను కూడా తాము స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో అన్సరుల్లా బంగ్లా టీమ్ వ్యవస్థాపకుడు ముఫ్తీ జసీమ్ ఉద్దీన్ రహ్మానీతో పాటు అనేక మంది అనుచురులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


