breaking news
Changi International Airport
-
విమానాశ్రయంలో చేతివాటం : అమెరికన్ డెంటిస్ట్, ఇంజనీర్ భార్యకు జైలు
సింగపూర్‌లోని విమానాశ్రయంలో లగ్జరీ వస్తువులను దొంగిలిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ఒక అమెరికన్ జంట పట్టుబడింది. పైగా వీరిద్దరూ మామూలు సిటిజన్స్కాదు, ఇద్దరూ గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నవారు. కానీ కక్కుర్తి పడ్డారు అదీ కఠినమైన చట్టాలు, జీరో టోలరెన్స్ నియమాలకు పెట్టింది పూరైన సింగపూర్ విమానాశ్రయంలో. చివరకు పోలీసులక చిక్కి కటాకటాల ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.కపాడియా హుస్సేన్ జోహెర్ (35), కపాడియా అమతుల్లా (30) ఇద్దరూ భార్యాభర్తలు. జోహెర్ దంతవైద్యుడిగా పనిచేస్తుండగా, అమతుల్లా ఇంజీనీర్గా ఉన్నారు. ఈ జంట సింగపూర్ విమానాశ్రయంలో విలాసవంతమైన వస్తువులను దొంగిలిస్తూ దొరికి పోయారు. అమెరికా జాతీయులైన ఈ జంట జూన్ 23న చాంగి విమానాశ్రయంలోని చాంగి విమానాశ్రయం టెర్మినల్ 1లోకి ప్రవేశించిన తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చోరీకి పాల్పడ్డారు. భారతదేశానికి కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కడానికి ముందు విమానాశ్రయంలో లూయిస్ విట్టన్ అండ్ డియోర్ నుండి 750 డాలర్లు (సుమారు రూ.65,790) ఎక్కువ విలువైన వస్తువులను దొంగిలించారని పోలీసుఅధికారులు తెలిపారు. విమానాశ్రయం లోపల ఉన్న సీసీటీవీ ఆధారంగా ఇద్దరిని విచారించి దొంగతనం చేసిన అధికారులు జైలు శిక్ష ఖరారు చేశారు. జొహెర్కు 18 రోజుల జైలు , అతని భార్యఅమతుల్లాకు వారం రోజుల జైలు శిక్ష విధించారు.చదవండి: 5 నెలల్లో 28 కిలోలు : అమీర్ ఖాన్ అద్భుత చిట్కాలు600 డాలర్ల విలువైన క్రెడిట్ కార్డ్ హోల్డర్‌ను, ది షిల్లా బ్రాండ్ కాస్మెటిక్స్ & పెర్ఫ్యూమ్స్ షాపులో డియోర్ సావేజ్ పెర్ఫ్యూమ్ బాటిల్‌ను జేబులో వేసుకున్నాడు. డబ్బు చెల్లించకుండా దుకాణం నుండి వెళ్లిపోయాడు. తన చోరీని ఎవరు చూడకుండా ఉండేందుకు భార్యను కాపాలాగా ఉంచాడు. తమ పని కానిచ్చి, ఏమీ తెలియనట్టు ముంబై విమానం ఎక్కి కామ్‌గా కూర్చుకున్నారు. కానీ పోలీసులకు చిక్కక తప్పలేదు. విమానం టేకాఫ్‌కు ముందే పోలీసులు వారిని అరెస్ట్ చేయడం విశేషం. జోహెర్ ఎక్కువ ఖర్చు చేసే అలవాటు ఉందనీ, దురాశతో దొంగతనం చేశాడని ప్రాసిక్యూటర్ తెలిపారు. దొంగిలించబడిన రెండు వస్తువులను స్వాధీనం చేసుకుని సంబంధిత దుకాణాలకు తిరిగి ఇచ్చారు. కాగా సింగపూర్లోచట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కఠినమైన చట్టాల కారణంగా సింగపూర్ ప్రపంచంలోనే అత్యల్ప నేరాల రేటు కలిగిన దేశాలలో ఒకటి. చూయింగ్ గమ్, ఇ-సిగరెట్లు, పబ్లిక్ టాయిలెట్‌ను ఫ్లష్ చేయకపోవడం లాంటివి కూడా ఇక్కడ నేరంగా పరిగణిస్తారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వారికి సుదీర్ఘ జైలు శిక్ష, 24 కొరడా దెబ్బలు శిక్ష అనుభవించాలి. చట్టవిరుద్ధమైన పదార్థాలను విక్రయించే ఎవరికైనా ఇక్క మరణశిక్ష తప్పదు.ఇదీ చదవండి: Sravana Sukravaram: ‘శ్రావణ లక్ష్మీ రావే మా ఇంటికి’... సెల్ఫీ షేర్ చేయండి! -
ఈ ఏడాది బెస్ట్,వరస్ట్ ఎయిర్ పోర్టులు..
విమానాశ్రయాల్లో విశ్రాంతి తీసుకోవడానికి అనువైన వాటిలో ఉత్తమ, చెత్త ఎయిర్ పోర్టుల జాబితాను 'గైడ్ టూ స్లీపింగ్ ఇన్ ఎయిర్ పోర్ట్స్' విడుదల చేసింది. విమానాశ్రయాల్లో ఎక్కువ సమయం వేచి ఉండే సందర్బాల్లో ప్రయాణికుల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ఈ జాబితాను తయారు చేశారు. నిద్ర పోవడానికి అనువైన, బెస్ట్ ఇన్ లే ఓవర్స్(విమానం మారాల్సి వచ్చినప్పుడు వేచి ఉండే సమయం), మిగతా సౌకర్యాల విషయంలో తీసుకునే జాగ్రత్తలను పరిశీలించి ఈ జాబితాను రూపొందించారు. బెస్ట్ ఎయిర్ పోర్టులు: 1)చాంగి అంతర్జాతీయ విమానాశ్రయం(సింగపూర్) ప్రయాణికులకు బోర్ కొట్టకుండా మాసాజ్ చైర్స్, బట్టర్ ఫ్లై గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సినిమా థియేటర్లు ఈ ఎయిర్ పోర్టు ప్రత్యేకత. అంతేకాకుండా 40 మీటర్ల ఎత్తులో నీరు ధారలా(ఫౌంటేయిన్) వచ్చేలా జువెల్ అనే కొత్త నిర్మాణాన్ని చేపట్టారు. ఇది 2018 వరకు పూర్తి కానుంది. 2)ఇచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం(సియోల్, దక్షిణ కొరియా) 3) హనెడా అంతర్జాతీయ విమానాశ్రయం( టోక్యో, జపాన్) 4) థావోయువాన్ అంతర్జాతీయ విమానాశ్రయం(థైపీ, థైవాన్) 5)మ్యూనిచ్ అంతర్జాతీయ విమానాశ్రయం(జర్మనీ) 6) కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం(ఒసాకా, జపాన్) 7) వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయం(వాంకోవర్, కెనడా) 8)హెల్సింకీ అంతర్జాతీయ విమానాశ్రయం(వాంటా, ఫిన్‌ల్యాండ్) 9)తల్లిన్ అంతర్జాతీయ విమానాశ్రయం(తల్లిన్, ఈస్టోనియా) 10)క్లోటెన్ అంతర్జాతీయ విమానాశ్రయం(జ్యూరిచ్, స్విడ్జర్‌ల్యాండ్) చెత్త ఎయిర్ పోర్టులు: 1) కింగ్ అబ్దుల్లాజిజ్ అంతర్జాతీయ విమానాశ్రయం(జెడ్డా, సౌదీ అరేబియా) ఎన్నో అంచనాలు ఉన్న జెడ్డా విమానాశ్రయంలో శుభ్రత లోపించడం, ప్రయాణికుల సౌకర్యాల కొరతతో చెత్త విమానాశ్రయాల జాబితాలో తొలిస్థానం దక్కింది. 'విమానాల ఆలస్యం, 14 గంటలు మెటల్ చైర్లోనే ఉండిరావడం, కరెంటు సమస్య, ఒకే వాష్ రూం లాంటి సమస్యలతో పాటూ ఓ హోల్ కారణంగా మూడు ఇంచుల మేర నీరు నిలిచిపోయినా ఎయిర్ పోర్టు అధికారుల నుంచి స్పందన కరువైంది' అని ఓ ప్రయాణికుడు తన అభిప్రాయాన్ని తెలిపాడు. 2) జుబా అంతర్జాతీయ విమానాశ్రయం(జుబా, సౌత్ సూడాన్) 3)పోర్ట్ హార్కోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం(పోర్ట్ హార్కోర్ట్, నైజీరియా) 4) థాష్కెంట్ అంతర్జాతీయ విమానాశ్రయం(థాష్కెంట్, ఉజ్జెకిస్తాన్) 5)సాంటోరిని విమానాశ్రయం( సాంటోరిని, గ్రీస్) 6) చనియా అంతర్జాతీయ విమానాశ్రయం( క్రెటె, గ్రీస్) 7)హెరాక్లియన్ అంతర్జాతీయ విమానాశ్రయం( క్రెటె, గ్రీస్) 8)సిమన్ బోల్వియర్ అంతర్జాతీయ విమానాశ్రయం(కారాకస్, వెనిజూలా) 9) లండన్ లుటన్ అంతర్జాతీయ విమానాశ్రయం(లుటన్, ఇంగ్లాండ్) 10) త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం(కఠ్మాండు, నేపాల్)