
శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం. ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలు, పెళ్లి అయిన కొత్త పెళ్లికూతుళ్లు, ముత్తైదువులంతా శ్రావణ మాసం చాలా పవిత్రమైందిగా భావిస్తారు. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారం (2025 ఆగస్టు 8 తేదీ) వరలక్ష్మీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. పౌర్ణమి ముందు కుదరకపోతే ఆ తరవాత వచ్చే శ్రావణ శుక్రవారాల్లో ఏదో ఒకరోజు ‘వరలక్ష్మీ వ్రతం’ ఆచరించవచ్చని పండితులు చెబుతున్న మాట.
శ్రావణ శుక్రవారం రోజు ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి తోరణాలతో అందంగా తీర్చిదిద్దుతారు. లక్ష్మీదేవిని అందంగా అంలకరించి శక్తి మేర ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. అష్టైశ్వర్యాలు ప్రసాదించమని వరాల తల్లికి మొక్కుకుంటారు. వరలక్ష్మీ వ్రత కథను చదువుకుని అక్షితలు జల్లుకుంటారు. ఆ తరువాత శనగలు పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, కొత్త బట్టలు, దక్షిణ వంటి వాటితో వాయనాన్ని ముత్తైదువులకు అందిస్తారు. శ్రావణ మాసంలో వాయనం ఇవ్వడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తారు. లక్ష్మీదేవి సకల సౌభాగ్యాలకు ,సకల సంపదలకు ప్రతీక అని భక్తుల విశ్వాసం. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి లాంటి పేర్లతో అమ్మవారిని పూజించి, కోరిన కోర్కెలు నెరవేరాలని కోరుకుంటారు.
ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా మగువలకు, మహిళా మణులకు ఒక గమనిక.
శ్రావణలక్ష్మీ రావే మా ఇంటికి..!
మీ ఇంట కొలువైన శ్రావణ లక్ష్మి ఫోటోను మీ వివరాలతో సాక్షి.కామ్ పాఠకులతో పంచుకోండి
అమ్మవారితో మీ ఫోటోను ‘90105 33389’ కు వాట్సాప్ చేయండి!