breaking news
sravana sukravaram
-
వరమహాలక్ష్మీ దేవికి శుచిగా, రుచిగా ప్రసాదాలు చేయండిలా!
శ్రావణ మాసం (Sravana Masam) అంటేనే పండగల సందడి. ఈ మాసమంతా ప్రతి ఇంట్లోనూ పండగ వాతావరణం నెలకొంటుంది. వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతాలను ఆచరిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డే లో భాగంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలను సులభంగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.పులిహోర: అన్ని పండగలకు, పుణ్యకార్యాలకు పులిహోర తప్పనిసరిగా ఉండాల్సిందే. ముందుగా పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: బియ్యం, చింతపండు,పసుపు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు ,మెంతులు, పల్లీలులేదా జీడిపప్పు, పచ్చిమిర్చి ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ చిటికెడు, బెల్లంముందుగా చింతపండుని శుభ్రం చేసుకొని, నానబెట్టి మెత్తని గుజ్జు తీయాలి. ఈ గుజ్జులో పసుపు, కరివేపాకు కొద్దిగా ఆయిల్ వేసి ఉడకనివ్వాలి. బాగా దగ్గరికి వచ్చి, నూనెపైకి తేలేదాకా దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేసి ఎండు మిర్చి, ఇతర పోపు దినుసులు వేసుకొని వేగనివ్వాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. కమ్మగా వేగిన తరువాత ముందే ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి మరికొంచెం సేపు ఉడకనివ్వాలి.బియ్యాన్ని మరీ మెత్తగా కాకుండా, పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఉడికాక ఒక బేసిన్‌లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో పచ్చి కరివేపాకు, కొద్దిగా పసుపు, పచ్చి ఆవాల ముద్ద వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇపుడు చింత పండు గుజ్జుతో పాటు ఉడికిన పోపును అన్నంలో కలపాలి. అంతే పులిహోర రెడీపూర్ణం బూరెలువరలక్ష్మీ వ్రతము రోజు అమ్మ వారి నివేదనకు తప్పనిసరిగా ఉండాల్సినవి పూర్ణం బూరెలు.కావాల్సిన పదార్థాలు: ఒక గాస్లు మినపపప్పు, రెండుగ్లాసుల బియ్యం, ఒక గ్లాసు శనగపప్పు, బెల్లం,యాలకులుతయారీ : మినపప్పు, బియ్యం కలిపి కనీసం నాలుగు గంటలు నాననివ్వాలి. దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ జారుగా, మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు కలుపుకోవాలి. దీంతో బూరెలకు కావాల్సిన తోపు పిండి రెడీ అవుతుంది. దీన్ని ఎక్కువ సేపు పులియకుండా జాగ్రత్త పడ్డాలి. పూర్ణం తయారీ : పచ్చి శనగపప్పు సరిపడా నీళ్ళు పోసి కుక్కర్లో నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడక బెట్టుకోవాలి. చల్లారాక నీళ్లు తీసేసి, పప్పు గుత్తితో మెత్త చేసుకోవాలి.కావాలంటే మిక్సీ వేసుకోవచ్చు. తరువాత దీన్ని గ్లాసు తరిగిన బెల్లపు పొడితో కలిపి మందపాటి గిన్నెలో వేసి స్టౌ మీద పెట్టి ఉడకనివ్వాలి. అడుగు అంటకుండా బాగా తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గర పడి పూర్ణం ఉడికి కొంచెం ముద్దలా అయ్యేదాకా ఉడకనివ్వాలి. తరువాత యాలకుల పొడి వేసుకోవాలి. కొంచెం చల్లారాక మనకు నచ్చిన సైజులో పూర్ణాల్లా(ఉండల్లా) తయారు చేసుకోవాలి.ఇప్పుడు స్టౌ మీద మూకుడు పెట్టి నూనె వేసి కాగనివ్వాలి. తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్న పూర్ణాలను తోపు పిండిలో ముంచి కాగుతూన్న నూనెలో జాగ్రత్తగా వేయాలి. మెల్లిగా తిప్పుతూ కాస్త ముదురు రంగు వచ్చేదాకా వాటిని ఎర్రగా వేయించు కోవాలి. అంతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు రెడీ.ఇదీ చదవండి: Sravana Sukravaram: ‘శ్రావణ లక్ష్మీ రావే మా ఇంటికి’... సెల్ఫీ షేర్ చేయండి!చక్కెర పొంగలి: అమ్మవారికి ఇష్టమైన మరో నైవేద్యం చక్కెర పొంగలి.కావాల్సిన పదార్థాలు బియ్యం అరకప్పు, పెసరపప్పు 1 టేబుల్ స్పూన్, బెల్లం, నెయ్యి ,యాలకులు 2జీడిపప్పులు, బాదం నేతిలో వేయించుకుని పెట్టుకోవాలి. చిటికెడు పచ్చ కర్పూరం జాజికాయ పొడితయారీ : పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి పెసరపప్పు దోరగా వేయించాలి. బాగా కడిగిన బియ్యం, పెసరపప్పుతోపాటు సరిపడా నీళ్లు, కొద్దిగా ఉప్పువేసి 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. మూత వచ్చాక ఇందులో తరిగిన బెల్లం వేసి ఉడికించాలి. అడుగు మాడకుండా బాగా కలపాలి. ఉడుకుతుండగా కొద్దిగి నెయ్యి వేసుకొని, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. దించే ముందు మరిగించిన చిక్కటి పాలు పోయాలి. చిక్కగా దగ్గరికి వచ్చిన తరువాత మరికొంచెం నెయ్యి వేసుకొని వేయించిన జీడిపప్పులు, బాదం వేసి కలుపుకుంటే కమ్మని చక్కెర పొంగలి రెడీ.చదవండి: తండ్రి కల..తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్....ఐఏఎస్ లక్ష్యం -
‘శ్రావణ లక్ష్మీ రావే మా ఇంటికి’ ఆహ్వానించండి.. సెల్ఫీ షేర్ చేయండి!
శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం. ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలు, పెళ్లి అయిన కొత్త పెళ్లికూతుళ్లు, ముత్తైదువులంతా శ్రావణ మాసం చాలా పవిత్రమైందిగా భావిస్తారు. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారం (2025 ఆగస్టు 8 తేదీ) వరలక్ష్మీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. పౌర్ణమి ముందు కుదరకపోతే ఆ తరవాత వచ్చే శ్రావణ శుక్రవారాల్లో ఏదో ఒకరోజు ‘వరలక్ష్మీ వ్రతం’ ఆచరించవచ్చని పండితులు చెబుతున్న మాట. శ్రావణ శుక్రవారం రోజు ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి తోరణాలతో అందంగా తీర్చిదిద్దుతారు. లక్ష్మీదేవిని అందంగా అంలకరించి శక్తి మేర ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. అష్టైశ్వర్యాలు ప్రసాదించమని వరాల తల్లికి మొక్కుకుంటారు. వరలక్ష్మీ వ్రత కథను చదువుకుని అక్షితలు జల్లుకుంటారు. ఆ తరువాత శనగలు పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, కొత్త బట్టలు, దక్షిణ వంటి వాటితో వాయనాన్ని ముత్తైదువులకు అందిస్తారు. శ్రావణ మాసంలో వాయనం ఇవ్వడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తారు. లక్ష్మీదేవి సకల సౌభాగ్యాలకు ,సకల సంపదలకు ప్రతీక అని భక్తుల విశ్వాసం. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి లాంటి పేర్లతో అమ్మవారిని పూజించి, కోరిన కోర్కెలు నెరవేరాలని కోరుకుంటారు. ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా మగువలకు, మహిళా మణులకు ఒక గమనిక.శ్రావణలక్ష్మీ రావే మా ఇంటికి..!మీరు వరలక్ష్మీ వ్రతం చేసుకున్నారా? అయితే మీ ఇంట కొలువైన శ్రావణ లక్ష్మి ఫోటోను మీ వివరాలతో సాక్షి.కామ్ పాఠకులతో పంచుకోండి. అమ్మవారితో మీ ఫోటోను ‘90105 33389’ కు వాట్సాప్ చేయండి! -
శ్రావణ శుక్రవార వ్రతం చేసిన తెలుగు సీరియల్ బ్యూటీస్ (ఫొటోలు)
-
శ్రావణ శుక్రవారం పూజలు చేసిన సురేఖవాణి, సుప్రీత (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో శ్రావణమాసం సందడి..ఆలయాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
34 ఏళ్ల తర్వాత సూపర్ హిట్ సినిమాకు రీమేక్..
దివంగత దర్శకుడు రామనారాయణన్ అద్భుత సృష్టి 'ఆడివెళ్లి'. ఈ మూవీలో హీరోయిన్ సీత ప్రధాన పాత్రను పోషించింది. 1990లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రావణ శుక్రవారం పేరిట తెలుగులోనూ అనువాదమై ఇక్కడా ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని రామనారాయణన్ కుమారుడు, నిర్మాత మురళి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆడివెళ్లి గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన చిత్రం కావడంతో అప్పట్లో అనూహ్య విజయాన్ని సాధించిందన్నారు. అప్పుడు నాకు తొమ్మిదేళ్లు ఆ చిత్రం నిర్మాణ సమయంలో తనకు తొమ్మిది సంవత్సరాలని, తండ్రి వెంట షూటింగ్‌కు వెళ్లిన విషయం తనకు ఇప్పటికీ జ్ఞాపకం ఉందని గుర్తు చేసుకున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రారంభదశలోనే తన తండ్రి దాన్ని చాలా బాగా వాడుకున్నారని చెప్పారు. ఆడివెళ్లి చిత్రాన్ని 90 రోజుల్లో పూర్తి చేశారన్నారు. ఆ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఉత్సవాల్లో మారుమోగుతూ ఉంటాయని పేర్కొన్నారు. ఏనుగు వంటి జంతువులకు ప్రాముఖ్యత కలిగిన ఆ చిత్రాన్ని రీమేక్ చేయడం కష్టంతో కూడిన పనేనన్నారు. అయినప్పటికీ ఈ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. సీత పాత్రలో నయనతార? దీనికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగిన దర్శకుడు అవసరమని చెప్పారు. ఆ కథను నేటి కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ చిత్రంలో సీత పోషించిన ప్రధాన పాత్రలో నయనతార నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, నిజానికి ఇంతవరకు ఇందులో నటించే నటీనటులను ఎంపిక చేయలేదన్నారు. ఏదేమైనా ఆడివెళ్లి రీమేక్‌లో నయనతార నటించనున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో ఇందులో ఆమె నటిస్తే బాగుంటుందని తామూ భావిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే చిత్ర వివరాలను చెబుతామని నిర్మాత మురళి పేర్కొన్నారు. -
శ్రావణ లక్ష్మీ నమోస్తుతే..
-
ఇంద్రకీలాద్రిపై శ్రావణమాసం సందడి
-
శ్రావణ శుక్రవారం అమ్మవారి గుడికి భక్తులు
-
వీక్షకులు పంపిన వరలక్ష్మీ వ్రతం ఫొటోలు
-
విజయవాడ : మార్కెట్లో శ్రావణ శుక్రవారం రద్దీ
-
అందుకే భక్తుల రద్దీ తక్కువగా ఉంది
-
చంద్రబాబు దంపతులు పుష్కర స్నానం
-
అందుకే భక్తుల రద్దీ తక్కువగా ఉంది: చంద్రబాబు
విజయవాడ : శ్రావణ శుక్రవారం కావడం వల్ల కృష్ణా పుష్కరాల తొలి రోజు భక్తుల రద్దీ తక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని దుర్గాఘాట్‌లో చంద్రబాబు దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ....రేపటి నుంచి అంటే శనివారం నుంచి భక్తుల రద్దీ పెరుగుతుందన్నారు. కృష్ణా పుష్కరాలు సందర్బంగా పవిత్ర సంకల్పాన్ని చేపట్టామని చెప్పారు. కృష్ణా పుష్కరాలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని వెల్లడించారు. రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా బస్సుల రద్దీని క్రమబద్దీకరిస్తున్నామన్నారు. విజయవాడ నగరంలో కొన్ని గుళ్లు తొలగించామని కొందరు గగ్గోలు పట్టారు.... అయినప్పటికీ చేయాల్సిన అభివృద్ధి చేయగాలిగామన్నారు. ప్రత్యేక హోదా కూడా త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.