శ్రావణ శుక్రవారం కావడం వల్ల కృష్ణా పుష్కరాల తొలి రోజు భక్తుల రద్దీ తక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని దుర్గాఘాట్లో చంద్రబాబు దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.