
భారత సైన్యంలో పురషాధిక్యతను వెనక్కినెట్టి మరీ ఉన్నత హోదాలను అలంకరించిన తొలి మహిళగా ఘనతను అందుకుంది. పైగా భారత సాయుధ దళాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహిళగా కీర్తిని కూడా దక్కించుకున్నారామె. ఆర్మీ, నేవీ రెండింటిల్లోనూ అత్యున్నత హోదాలను కలిగి ఉండగటమే గాక త్రీ స్టార్ ర్యాంక్ సాధించిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకుందామె.
ఆ శక్తిమంతమైన మహిళే లెఫ్టినెంట్ జనరల్ పునితా అరోరా(Lieutenant General Punita Arora). బ్రిటిష్ ఇండియా కాలంలో పంజాబ్‌లోని లాహోర్‌లో మే 31, 1946న జన్మించిన పునీతా అరోరా ప్రారంభ జీవితం విభన గందరగోళాల మధ్య సాగింది. ఆరోరా ఏడాది వయసులో పంజాబీ కుటుంబం భారతదేశానికి పారిపోయి ఉత్తరప్రదేశ్ సహారన్‌పూర్‌లో తలదాచుకుంది. అక్కడే ఆమె బాల్యం అంతా సాగింది. సహారన్‌పూర్‌లోనే ఎనిమిదో తరగతి వరకు చదువుకుంది.
ఆ తర్వాత తరువాత గురునానక్ గర్ల్స్ ఇంటర్-కాలేజీలో చదువుకుంది. ఆ రోజుల్లో మహిళలు చదువుకోవడం గగనం. అలాంటిది ఆమె సైన్సు రంగంలోకి వెళ్లాలనుకోవడంలోనే ఆమె ధైర్యం ఎట్టిదో తేటతెల్లం అవుతోంది. అలా ఆమె పూణేలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (AFMC)లో చేరి టాపర్‌గా బంగారు పతకాన్ని అందుకుంది.
అక్కడ నుంచి అన్ని విజయ పరంపరలే, అగ్రశ్రేణిలో దూసుకుపోతూనే ఉంది. ఆమె మెడిల్ పరంగా గైనకాలజీ రంగాన్ని ఎంచుకుంది. అలా ఆమె ఆర్మీలో వైద్యురాలిగా కెరీర్‌ని ప్రారంభించింది. కెరీర్ పరంగా ఉన్నత హోదాలను అందుకోవడమే కాదు, సైన్యంలో వైద్య సేవలను మరింత ముందుకు తీసుకువెళ్లేలా తన వంతుగా కృషి చేశారామె.
అలంకరించిన పదవులు..
అరోరా సాయుధ దళాల వైద్య నిపుణులకు శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మక సంస్థ పూణే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీకి కమాండ్‌గా పనిచేసిన తొలి మహిళా అదికారిణిగా ఘనత అందుకుంది. అక్కడ ఆమె నాయకత్వ సామార్థాల్యు బహిర్గతమయ్యాయి. ఆ తర్వాత అదనపు డైరెక్టర్ జనరల్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (మెడికల్ రీసెర్చ్) వంటి పదోన్నతులను అందుకుంది. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (AFMS) కామన్ పూల్ వ్యవస్థ సాయంతో నావికాదళానికి మారారు. అక్కడ 2005లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (నేవీ)గా నియమితులయ్యారు. దాంతో సర్జన్ అడ్మిరల్ హోదాను పొందిన తొలి మహిళగా నిలిచింది.
మిలటరీ మెడిసిన్‌కు విరాళాలు..
సాయుధ దళాల ఆసుపత్రులలో గైనకాలజికల్ ఎండోస్కోపీ, ఆంకాలజీ సౌకర్యాలను స్థాపించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అక్కడ సేవా సభ్యులు, వారి కుటుంబాలకు ప్రత్యేక సంరక్షణను పెంచారు. అలాగే సంతాన లేమి సమస్యతో బాధపడుతున్న సైనిక జంటలకు గణనీయమైన మద్దతు అందించారు. అందుకుగానూ ప్రతిష్టాత్మకమైన పతకం వరించింది. జమ్మూలో 2001లో కలుచక్ ఉగ్రవాద దాడి సమయంలో గాయపడ్డ 70 మంది సైనికులకు, మరణించి 23 మంది సైనికులకు చికిత్సలు అందించి..అసామానమైన సేవకు నిదర్శనంగా నిలిచిందామె.
ఈ విశిష్ట సేవలకు గానూ 2002లో సేవ పతకం వరించింది. అలా 2004లో అరోరా లెఫ్టినెంట్ జనరల్ హోదా పొంది భారత సాయుధ దళాల్లో త్రీ స్టార్ ర్యాంకుని సాధించిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. అంతగాదు భారత నావికాదళంలో కూడా సర్జన్ వైస్ అడ్మిరల్‌గా నియామకంతో రెండింటిల్లోనూ ఉన్నత హోదాలు కలిగిన తొలి మహిళగా ఘనత దక్కించుకుంది.
అంతేగాదు తన కెరీయర్ తొలినాళ్లలోల ఒక సీనియర్ వైద్యుడు మహిళ గైనకాలజిస్ట్‌తో కలిసి పనిచేయడమే అనే సంశయం వ్యక్తం చేశాడు. అయితే త్వరిత కాలంలోనే ఆమె టాలెంట్‌ని గుర్తించి..తానే ఆమెతో పనిచేయడం గొప్ప అవకాశంగా ప్రశంసలందుకుందామె. ఆర్మీ జంటలకు సంతాన లేమి సమస్యను నివారించి విజయవంతమైన గర్భధారణలకు అంకురార్పణ చేసి "ఫెయిరీ గాడ్ మదర్" అనే బిరుదును కూడా అందుకుంది.
అయితే ఆమె ఇన్ని విజయాలు సాధించినా..నా పని నేను నిబద్ధతతో చేశాను, విజయాలు అవంతట అవే వచ్చాయంటారామె. ఇక్కడ అరోరా సాధించిన కెరీర్ విజయాలు ఒక మహిళ సంక్షోభ సమయంలో ఏ విధంగా నిలబడగలదో ప్రపంచానికి అవగతమయ్యేలా చేసింది. అంతేగాదు మహిళలు సాయుధ దళాల్లో అవలీలగా తమ బాధ్యతలను నిర్వర్తించగలరు అనేందుకు స్ఫూర్తిగా నిలిచారామె.
(చదవండి: నచ్చినట్లుగా తలరాతనే మార్చుకుందామె..! హ్యాట్సాప్ నీతు మేడమ్.. )