
జనానాం క్షున్నివృత్యర్థం ప్రత్యూషే భజతి ప్రభుః
తథాహి శ్రీహరిసృష్టా కామధేనుః ప్రసూరభూత్
లోకాలన్నిటికీసంతృప్తి కల్గటానికి శ్రీహరి తన ఆకలి తీర్చుకుంటాడు. అందుకే కామధేనువు సృష్టి జరిగింది. సర్వజీవకోటికీ ఆహారాన్ని అనుగ్రహించటమే శ్రీహరి సంకల్పం.
నిజమాలోచిస్తే, శ్రీహరికి ఆకలి ఏమిటనిపిస్తుంది. గోలోకంలో ఒకప్పుడు శ్రీకృష్ణుడు తనకు ఆకలి వేసింది అన్నాడు. రాధ ప్రక్కనే ఉంది. ఇదేదో విచిత్రమనుకొన్నది. అప్పుడు శ్రీకృష్ణుడు తన దేహం ఎడమభాగం నుండి ‘సురభి’ని సృష్టించాడు. ఒక కుండలోకి పాలు పితికాడు. ఆయన కొన్ని ఆరగించి, ఎందుకనో ఆ కుండను నేలకేసి కొట్టాడు. ఆ కుండ తాకిడికి భూమి మీద ఒక పెద్ద కొలను ఏర్పడింది. ఆ కొలను చూడగానే రాధకు పట్టలేనంత సంతోషం కల్గింది. ఆ కొలనులో స్నానం చేస్తూ, ఈతలు కొడుతూ సంతోషంతో, కేరింతలు కొట్టడం ప్రారంభించింది.ఈ సురభి నుండి గోవులనేకం పుట్టు కొచ్చాయి. అవి అన్నీ, భూలోకానికి చేరు కున్నాయి. భూమి మీద ఉన్న ఆవులజాతిఅంతా ఈ సురభి సంతానమే. భూమి మీద మానవులంతా ఈ ఆవులను పోషిస్తూ, వాటి పాలు, పెరుగు, నెయ్యి మొదలగునవి ఆహా రంగా తీసుకొని, సుఖశాంతులతో ఉన్నారు. ఆవును తల్లిగా భావించి, రక్షించి, పూజించటం ప్రారంభించారు. అప్పటినుంచి అది ‘గోమాత’ అని పిలవబడింది.
ఇదీ చదవండి: Raksha Bandhan 2025 పర్వాల పూర్ణిమ, రాఖీ పరమార్థం ఇదే!
ఒకప్పుడు భూలోకంలో విపత్కరమైన కరవు వచ్చింది. అందువల్ల గోరక్షణా లేదు, గోపూజా లేదు. పంచ గవ్యములు లేక పోవటం చేత యజ్ఞయాగాదులు ఆగి పోయాయి. అందువల్ల దేవతలకు హవిర్భా గాలు అందటం లేదు. కనుక మానవులతో పాటు దేవతలకు కూడా ఇబ్బంది కల్గింది. ఇలా దేవతలు, మానవులు ఇక్కట్టుల పాలవటం బ్రహ్మ గమనించి దేవతలనువెంటబెట్టుకొని, గోలోకం వెళ్లాడు. అక్కడశ్రీకృష్ణునికి ఈ బాధలన్నీ చెప్పి మొర పెట్టుకున్నాడు. కృష్ణుడు వారి దైన్యాన్ని చూచి మొర ఆలకించి కనికరించాడు. వెంటనే సురభిధేనువు తోక నుండి ‘కామధేనువు’ను సృష్టించి దేవతలకు అనుగ్రహించాడు. దేవతల కోరిక మేరకు ఆ కామధేనువు వేలకొలది ఆవుల్ని భూలోకానికి ప్రసాదించింది.మళ్లీ ప్రజలందరికీ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. యథావిధిగా గోపూజ, గోరక్షణ మునుపటి లాగానే కొనసాగుతున్నాయి. జయ గురు దత్త!
చదవండి: Sravana Sukravaram: ‘శ్రావణ లక్ష్మీ రావే మా ఇంటికి’... సెల్ఫీ షేర్ చేయండి!
శ్రీ గణపతిసచ్చిదానందస్వామి