బంగ్లాదేశ్‌లో మరో మైనారిటీ హిందువు హత్య | Bangladesh Ansar member shot dead by colleague accused detained | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో మరో మైనారిటీ హిందువు హత్య

Dec 30 2025 5:04 PM | Updated on Dec 30 2025 6:57 PM

Bangladesh Ansar member shot dead by colleague accused detained

ఢాకా: బంగ్లాదేశ్‌లో  మైనారిటీ హిందువుల హత్యలు తీవ్ర ఆందోళన పుట్టిస్తున్నాయి. ఇటీవల ఐదు హిందూ కుటుంబాల ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టడం ఆలయాలపై దాడులు, ఇళ్ల ధ్వంసం, మతపరమైన వేధింపులు కలవరపెడుతోంది. తాజాగా బంగ్లాదేశ్‌లో మరో మైనారిటీ హిందువు హత్యకు గురయ్యాడు.

మైమెన్‌సింగ్‌లోని భలుకాలో బజేంద్ర బిశ్వాస్ (40) అనే అన్సార్ (రక్షణ కమిటీ) సభ్యుడిని సహోద్యోగి కాల్చి చంపాడు.ఈ సంఘటనలో హంతకుడు అన్సార్ సభ్యుడు నోమన్ మియాను అరెస్టు చేశారు. 

మరోవైపు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఆ సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 20 మంది అన్సార్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. బజేంద్ర బిస్వాస్ ,నోమన్ మియా ఆవరణలో కలిసి కూర్చున్నప్పుడు నోమన్ వద్ద ఉన్న తుపాకీ పేలిందనే కథనాలు వినిపిస్తున్నాయి. బుల్లెట్ బిస్వాస్ ఎడమ తొడలో దూసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఫ్యాక్టరీ సిబ్బంది బజేంద్ర బిస్వాస్‌ను భాలుకా ఉపజిల్లా హెల్త్ కాంప్లెక్స్‌కు తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. భాలుకా మోడల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్-ఇన్‌చార్జ్ జాహిదుల్ ఇస్లాం ఈ సంఘటనను ధృవీకరించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మైమెన్‌సింగ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ మార్చురీకి పంపారు.

కాగా బంగ్లాదేశ్ ఒక తీవ్రవాద రాజ్యంగా మారుతోంది. ఈ హత్యాకాండపై సర్వత్రా ఆందోళన వ్యకమవుతోంది. బంగ్లాదేశ్‌లో హిందువులు ఎదుర్కొంటున్న అభద్రతకు ఇది నిదర్శమంటూ ఆగ్రహం వెల్లువెత్తుతోంది.

ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్‌ఆర్‌ఐ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement