అమానుష ఘటన.. 4 ఏళ్ల చిన్నారిపై మైనర్ బాలుడి లైంగిక దాడి | Disturbing Incident In Pileru, Minor Boy Accused Of Assaulting 4-Year-Old, Locals Demand Strict Action | Sakshi
Sakshi News home page

అమానుష ఘటన.. 4 ఏళ్ల చిన్నారిపై మైనర్ బాలుడి లైంగిక దాడి

Feb 19 2026 11:20 PM | Updated on Feb 20 2026 1:42 PM

Inhuman incident in Annamayya district

సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని డిగ్రీ కాలేజ్ సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 4 ఏళ్ల చిన్నారిపై ఒక మైనర్ బాలుడు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురైయ్యారు. వెంటనే నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి గురించి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. స్థానికులు చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement