తిరుమల లడ్డూ కథనాలపై ఎల్లో మీడియాకు కోర్టు నోటీసులు | VijayawCourt Issues Notice to Yellow Media over Tirumala Laddu Adulteration Row | Sakshi
Sakshi News home page

తిరుమల లడ్డూ కథనాలపై ఎల్లో మీడియాకు కోర్టు నోటీసులు

Feb 19 2026 7:55 PM | Updated on Feb 19 2026 8:08 PM

VijayawCourt Issues Notice to Yellow Media over Tirumala Laddu Adulteration Row

సాక్షి,విజయవాడ: తిరుమల లడ్డు అంశంపై ఎల్లో మీడియాకు విజయవాడ కోర్టు నోటీసులు జారీచేసింది. తిరుమల లడ్డూ అంశంలో ఎల్లో  మీడియా కథనాలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయనే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సంబంధిత కథనాలపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. 

కూటమి అనుకూల ఎల్లో మీడియా తిరుమల లడ్డూ అంశంపై అనువసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్‌ కుమార్‌ విజయవాడ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై కోర్టు గురువారం విచారణ చేపట్టింది.

 విచారణ సందర్భంగా పదేపదే టీటీడీ లడ్డులో జంతు కొవ్వులు,కెమికల్స్ కలిసాయంటూ న్యూస్ చానల్స్ డిబెట్లు పెడుతున్నాయని జడ శ్రవణ్ కోర్టుకు తెలిపారు.  అనవసర డిబెట్ల కారణంగా శ్రీవారి భక్తుల్లో ఆందోళన రేకెత్తుతుందన్నారు. న్యూస్ చానల్స్ చేస్తున్న రాద్ధాంతాన్ని కట్టడి చేయాలని కోర్టును కోరారు. జడ శ్రవణ్ కుమార్ వాదనలపై న్యాయస్థానం ఏకీభవించింది. కథనాలపై వివరణ ఇవ్వాలని సంబంధిత మీడియా ఛానెళ్లకు పంపించిన నోటీసుల్లో ఆదేశాలు జారీ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement