breaking news
Jada Sravan Kumar
-
ఏం సమాధానం చెప్తావ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగిన జడ శ్రవణ్ కుమార్
-
Jada Sravan: నీకు దమ్ముంటే లెక్కలు బయటపెట్టు
-
Jada Sravan: పవన్ అలా చేస్తే సెల్యూట్ చేస్తా..
-
షూ చూశారా.. నన్ను టచ్ చేస్తే.. ఒక్కొక్కడికీ..
-
పవన్ నీ సొల్లు కబుర్లు ఆపు.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన జడ శ్రవణ్
-
Jada Sravan: జగన్ హయాంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తే..
-
Jada Sravan: చేతకాని హోమ్ మంత్రి... ఆ జనసేన నేతను ఎప్పుడు ఎన్ కౌంటర్ చేస్తారు?
-
జనసేన నేతలకు షూ చూపించిన జడ శ్రవణ్
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిన్నారులపై ఆకృత్యాలు పెరిగిపోయాయని జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ (jada sravan kumar) ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో శనివారం ఆయన విలేకరులతో మాట్టాడుతూ.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం సమీప గ్రామానికి చెందిన బాలికపై దారుణానికి పాల్పడిన జనసేన యువజన నాయకుడు రాయపురెడ్డి సత్యవెంకటకృష్ణ (బాబీ)పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.జనసేన నేత ఆత్మహత్య చేసుకుంటాడా?హోంమంత్రి అనిత (Home Minister Anitha) ప్రతాపం అంతా ఎస్సీ ఎస్టీలు, బలహీన వర్గాల మీద చూపిస్తున్నారని.. అగ్రవర్ణాల వారు తప్పు చేస్తే పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కోనసీమ ఘటన అధికార పత్రికల్లో రాలేదు కాబట్టి పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. 'తుని ఘటనలో టీడీపీ నేత నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నట్లు.. జనసేన నేత ఆత్మహత్య చేసుకుంటాడా?, నారాయణ ఎస్పీ కాబట్టి ఆత్మహత్య చేసుకుంటాడా?, జనసేన నేత పవన్ క్యాస్ట్ కాబట్టి ఆత్మహత్య చేసుకోడా? కాపు సామాజిక వర్గం కాబట్టి జనసేన నేతను జైలుకు తీసుకెళ్లి సకల సౌకర్యాలు కల్పిస్తారా? హోంమంత్రి సమాధానం చెప్పాల'ని శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు.పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంఆడపిల్లల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన వారి తాట తీస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. కనిపించకుండా పోయిన 30 వేల మంది మహిళలను 30 రోజుల్లో తీసుకుని వస్తామని చెప్పారు. 16 నెలలు అయినా ఒక్క అమ్మాయిని తీసుకుని రాలేదని అడిగారు. బాధితులను హత్తుకున్నట్టు నటించి.. డబ్బులు తీసుకుని పార్టీలో జాయిన్ చేసుకుంటారా అని ప్రశ్నించారు.వారిని షూతో కొట్టొచ్చా?జనసేన పార్టీ (Janasena Party) అధికారికంగా తనపై ఆరోపణలు చేసింది కాబట్టి స్పందిస్తున్నానని తెలిపారు. తనపై చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ''జనసేన పార్టీ కార్యాలయానికి చర్చకు వస్తాను. మీరు సిద్దమా? చర్చకు నేను ఒక్కడినే వస్తాను.. టైం పవన్ చెప్పాలి. దమ్ముదైర్యం ఉంటే టైం చెప్పాలి. 48 గంటలు సమయం జనసేనకి ఇస్తున్నాను. మాట్లాడే ప్రతిమాట.. చేసే ప్రతికామెంట్ కౌంట్ చేస్తున్నాం. ప్రతి దానికి సమాధానం చెప్తా. రాజకీయ కామెంట్స్ చేయండి.. కానీ పర్సనల్ కామెంట్స్ చేస్తే చూస్తు ఊరుకోం. వైసీపీ నుంచి ప్యాకేజీ తీసుకున్నానని అంటున్న వాళ్లు ఆధారాలు చూపిస్తే రాజకీయాలు వదిలేస్తా. గతంలో ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ ఊగిపోయి, నోటికొచ్చినట్టు తిడుతూ చెప్పు చూపించారు. నేను షూ చూపిస్తున్నాను. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిన వారిని షూతో కొట్టొచ్చా? చంద్రబాబు, పవన్, లోకేష్ జడ శ్రవణ్‌ను టచ్ చేసి చూడండి ఏం జరుగుతుందో చూస్తారు. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడానికి పవన్ పనిచేస్తారు. ప్రజల సమస్యల పరిష్కారానికి మేం పోరాటం చేస్తున్నామ''ని జడ శ్రవణ్ అన్నారు. -
Jada Sravan: ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చే వ్యక్తి పవన్ కళ్యాణ్
-
Jada Sravan: రాత్రి 10 గంటలకు పోలీసులు ఫోన్ చేసి నాతో చెప్పిన మాట..
-
నీ వల్ల ఏం ఉపయోగం.. పవన్‌ను ఏకిపారేసిన జడ శ్రావణ్
-
పీపీపీ కమిషన్లలో బాబు, పవన్, లోకేష్‌కు వాటాలు: జడ శ్రావణ్ కుమార్
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో బడుగు,బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడలో శనివారం మేధోమథనం సదస్సు జరిగింది.జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేటీకరణ చేయడమే. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వల్ల సామాన్యులకు తీరని నష్టం తప్పదు. ఈ విధానం వల్ల బడుగు,బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుంది. తీవ్ర వ్యతిరేకత వస్తున్న చంద్రబాబు వెనక్కి తగ్గకపోవడం వెనుక అతిపెద్ద లాభం ఉందనేది స్పష్టమవుతోంది. పీపీపీ చేయడం వల్ల వచ్చే కమిషన్లలో చంద్రబాబు,పవన్,లోకేష్‌కు వాటాలు పంచుకోవాలనుకుంటున్నారు... ప్రైవేటీకరణ చేయడం వల్ల ఒక్క ఏడాది అడ్మిషన్లలోనే రూ.400 కోట్లు సంపాదిస్తారు. చంద్రబాబుకు నాదొక సూటి ప్రశ్న..ధైర్యముంటే సమాధానం చెప్పాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగే విధానంలోనే పీపీపీలోనూ చేపడతారని చెప్పగలరా?. ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే మన భావితరాలు తీవ్రంగా నష్టపోతాయి. మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేయనిస్తే మన భవిష్యత్ తరాలు మనల్ని క్షమించరు. కచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి అని అన్నారాయన. ఈ క్రమంలో.. సీఎం చంద్రబాబు,హోంమంత్రి అనిత పై జడ శ్రవణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ‘‘అన్నీ నేనే కనిపెట్టానని చంద్రబాబు చెబుతారు. చంద్రబాబు వల్ల ఏడాదికి 2500 మంది పేద విద్యార్ధులకు విద్య అందకుండా చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత తన పని తాను చేయడం లేదు. శాంతిభద్రతలను గాలికొదిలేసి మెడికల్ కాలేజీల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన వంగలపూడి అనితకు నాదొక ప్రశ్న. ప్రభుత్వ మెడికల్ కాలేజీల అడ్మిషన్ పద్ధతిలోనే ప్రైవేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్లు జరుగుతాయా?. పేద విద్యార్ధులకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయారు?’’ అని ప్రశ్నించారాయన. అమ్ ఆద్మీ పార్టీ నేత నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ.. పీపీపీ అంటే చంద్రబాబుకు తెలుసా?. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రజలకు ఇచ్చే అసలైన సంక్షేమం. కోవిడ్ నేర్పిన పాఠాలను మనం గుర్తు తెచ్చుకోవాలి. పేదలకు మెరుగైన వైద్యం,వైద్య విద్యను అందజేస్తేనే సమాజం బాగుపడుతుంది. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఏడాదికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేకపోతున్నారా?.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా...ప్రజలతో వ్యాపారం చేస్తున్నారా? అని నిలదీశారు. జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని.. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదీ చదవండి: టీడీపీలో వాళ్లు పనోళ్లేనా?


