పవన్‌ మోస్ట్‌ కామిక్‌ పర్సన్‌: జడ శ్రావణ్‌ | Pawan is a highly comical fellow says Jada Sravan | Sakshi
Sakshi News home page

పవన్‌ మోస్ట్‌ కామిక్‌ పర్సన్‌: జడ శ్రావణ్‌

Jun 22 2026 11:32 AM | Updated on Jun 22 2026 1:04 PM

Pawan is a highly comical fellow says Jada Sravan

సాక్షి, విజయవాడ: ఈ శతాబ్ధపు మోస్ట్‌ కామిక్‌ పర్సన్‌ పవన్‌ కల్యాణ్‌ అని జై భీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్‌ న్యాయవాది జడ శ్రావణ్‌ కుమార్‌ అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్‌ కల్యాణ్‌ తీరు మీద సోషల్‌ మీడియాలో మీమ్స్‌ ట్రోల్‌ అవుతున్నాయి. సినిమాల్లో కంటే నిజ జీవితంలో పవన్‌ కల్యాణ్‌ అద్భుతంగా నటిస్తున్నారని శ్రావణ్‌ విమర్శలు గుప్పించారు. పవన్‌ వెంట ఒక సామాజిక వర్గం ఎలా నడుస్తున్నదో తనకు అర్థం కావడం లేదన్నారు.

పవన్‌ నాలెడ్జి చూసి జనసేన నేతలు,కార్యకర్తలు తరించాలని శ్రావణ్‌ అన్నారు. పదిమందిలో మాట్లాడుతున్నామన్న బాధ్యత లేకుండా పవన్‌ మాట్లాడుతున్నారని, పవన్‌ మాటలకు తన పీఏ కూడా స్పందించరని శ్రావణ్‌ పేర్కొన్నారు. 2019 వరకూ టీడీపీప్రభుత్వమే అధికారంలో ఉందికదా.. దానిమీద పవన్‌ ఎందుకు మాట్లాడరని నిలదీశారు. సుగాలి ప్రీతి ఏ ఏడాదిలో చనిపోయిందో తెలియకుండా పవన్‌ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సుగాలి ప్రీతి విషయంలో పవన్‌ భౌభౌ మని అరిచారని అన్నారు. పోలీసులు సమర్పించిన చార్జ్‌షీట్‌లో అన్ని ఆధారాలు ఉన్నాయని, అయితే పవన్‌ లేవంటున్నారని శ్రావణ్‌ పేర్కొన్నారు. సుగాలి ప్రీతికేసులో ఆధారాలన్నీ కోర్టులో భద్రంగా ఉన్నాయన్నారు. ఆధారాలు లేవంటూ నిందితులను తప్పించాలని అనుకుంటున్నారా అని శ్రావణ్‌ ‍ప్రశ్నంచారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement