ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం | Rasi Phalalu: Daily Horoscope On 21-06-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

Jun 21 2026 2:16 AM | Updated on Jun 21 2026 11:02 AM

Rasi Phalalu: Daily Horoscope On 21-06-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసం, తిథి: శు.సప్తమి రా.8.09 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: పుబ్బ ప.2.41, వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: రా.9.54 నుండి 11.33 వరకు, దుర్ముహూర్తం: సా.4.4 నుండి 5.41 వరకు, అమృత ఘడియలు: ఉ.8.21 నుండి 9.56 వరకు.

సూర్యోదయం : 5.30
సూర్యాస్తమయం : 6.33
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం...  కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం....  బంధువులతో తగాదాలు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం..... ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

కర్కాటకం...  ముఖ్యమైన పనులలో జాప్యం. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి.  ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

సింహం....  పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య...  బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. ధనవ్యయం.

తుల...  శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం...  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు రాగలదు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

ధనుస్సు....  కుటుంబసమస్యలు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మకరం...  కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబ సమస్యలు. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

కుంభం...  నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. భూవివాదాల పరిష్కారం. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

మీనం.....  పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో నూతనోత్సాహం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement