అత్యంత అరుదైన బనారసి కడియల్ నేత చీరలో జాన్వీ కపూర్‌..! | Janhvi Kapoors Banarasi Saree in the Coveted Kadiyal Technique | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: అత్యంత అరుదైన బనారసి కడియల్ నేత చీరలో జాన్వీ కపూర్‌..! మత్స్యకారుల..

Jun 23 2026 12:10 PM | Updated on Jun 23 2026 12:24 PM

Janhvi Kapoors Banarasi Saree in the Coveted Kadiyal Technique

బాలీవుడ్‌ నటి, దివంగత టాలీవుడ్‌ నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ ఎప్పటికప్పుడూ తనదైన శైలిలో ఫ్యాషన్‌తో అలరిస్తుంటుంది. టాలీవుడ్‌ హీరో రామచరణ్‌ మూవీ పెద్దితో మంచి హిట్‌ని అందుకుంది. ఇటీవల తన అక్క అన్షులా కపూర్ వివాహ వేడుకల్లో అత్యంత అరుదైన చేనేత చీర ధరించి అందర్నీ ఆకర్షించారు. ఈ చీర ఎంత ప్రత్యేకమైనదంటే..నేయడమే అత్యంత విలక్షణం, కష్టతరమైన కళాత్మక పని కూడా. ఆ నేతను నేసే కళాకారులు కూడా ఇప్పుడంతగా లేరు. అంత పురాతనమైన చేనేత చీర ఇది. మరి ఆ చీర విశిష్టత గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

జాన్వీ కపూర్ ధరించిన బనారసి చీర, క్లిష్టమైన కడియల్ నేత గొప్పతనానికి చెందింది. దీన్ని సౌరవ్‌ దాస్‌ రూపొందించారు. మేగాన్ కాన్సెసియో స్టైలింగ్‌లో ఆమె తన చీరను "మత్స్యకారుల భార్యల చోళీ"ల మాదిరి బ్లౌజ్‌ని జత చేశారు. 

తన చీర లుక్‌కికి అనుగుణంగా జుమ్కాలు, కడాతో కలిగిన సాంప్రదాయ దేవాలయ ఆభరణాలను ఎంచుకున్నారామె. కురులను వదులుగా వదిలేసి..సింపుల్‌ మేకప్‌తో అట్రాక్టివ్‌ లుక్‌తో కనిపించారామె. ఆమె ధరించిన బనారసీ చీర తరతరాలుగా నిలిచిపోయేంత విలువైన కడియల్‌ నేతతో నేసిన శారీ. 

ప్రత్యేకత..
ఈ చీర వారణాసిలో అత్యంత ప్రజాదరణ పొందిన చేనేత చీరలలో ఒకటి. అక్కడ తంచోయ్, జాంగ్లా, మీనాకారి, గ్యాసర్, రంగకాట్, ఏక్‌తారా, కధ్వా, కడియల్‌ తదిత ప్రసిద్ధ చేనేత చీరలు ఉన్నాయి. కోర్వాయిగా పిలిచే ఈ కడియల్‌ నేత మూడి షటిల్స్‌తో నేస్తారు. ఈ పద్ధతిలో నేయడానికి అత్యంత నైపుణ్యం గల కళాకారులు అవసరం. కాబట్టి ఇది చాలా అరుదైనది. జాన్వి చీరలో కనిపించే విధంగా..విభిన్నమైన అంచును రూపొందించడానికి ఈ విధమైన పద్ధతిని ఉపయోగిస్తారు. 

చీర పై, క్రింది అంచులను రూపొందించడాని ఈ మూడు షటిల్స్‌ పద్ధతిలో నేస్తారు. అలాగే అంచులను కలపడానికి ఇంటర్‌లాకింగ్‌ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇందులో అల్లిక పద్ధతినే కడియల్ అని అంటారు. ఈ పద్ధతిని పైఠానీ చీరలలో కూడా ఉపయోగిస్తారు. ఈ విధానంలో నేయడానికి ఎక్కువ శ్రమ అవసరం. అందుకే పవర్‌ లూమ్స్‌ ఈ చీరలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతోంది. 

అదీగాక దీని వాడకం కూడా తగ్గిపోవడంతో ఈ చీరల కొరత అధికంగా ఉంది. ఇప్పుడిప్పుడే మళ్లీ కడియల్ బ్రోకేడ్ చీరలకు ఆదరణ పెరుగుతుండటం విశేషం. ఈ చీర భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన విలువైన చేనేత వస్త్రంగా పేరుగాంచింది కూడా. 

(చదవండి: 72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..)
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement