వైభవ్‌ సూర్యవంశీ ప్రపంచ రికార్డు | Vaibhav Sooryavanshi 11 Balls Fifty Breaks World Record-Cricket History | Sakshi
Sakshi News home page

వైభవ్‌ సూర్యవంశీ ప్రపంచ రికార్డు

Jun 21 2026 10:32 AM | Updated on Jun 21 2026 2:19 PM

Vaibhav Sooryavanshi 11 Balls Fifty Breaks World Record-Cricket History

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఏతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీ 11 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్‌ సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు. లీగ్‌ దశలో లంక- ఏ ఆటగాళ్లతో గొడవను పర్సనల్‌గా తీసుకున్న వైభవ్‌ మ్యాచ్‌ ఆరంభం నుంచే లంక బౌలర్లను చీల్చి చెండాడుతూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. 

గతంలో లిస్ట్-ఏ క్రికెట్‌లో 2005లో శ్రీలంక క్రికెట‌ర్ కౌష‌ల్య వీర‌ర‌త్నే 12 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించాడు. తాజాగా ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన వైభ‌వ్ లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అతి త‌క్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన తొలి ఆట‌గాడిగా రికార్డుల‌కెక్కాడు.

అంతేకాదు వన్డే ఫార్మాట్‌లోనూ సౌతాఫ్రికా దిగ్గ‌జం ఏబీ డివిలియ‌ర్స్ రికార్డును వైభ‌వ్ సూర్య‌వంశీ బ‌ద్ద‌లు కొట్టాడు. ఏబీ డివిలియర్స్ 2015లో వెస్టిండీస్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో 16 బంతుల్లోనే అర్ధ‌సెంచ‌రీ సాధించాడు. వెస్టిండీస్ బ్యాట‌ర్ మాథ్యూ ఫోర్డ్ కూడా 2025లో ఐర్లాండ్‌తో వ‌న్డేలో 16 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ సాధించాడు. 

అయితే వైభ‌వ్ సూర్య‌వంశీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మార్క్ అందుకున్న‌ది అన‌ధికారిక వ‌న్డే మ్యాచ్ కావ‌డంతో అంత‌ర్జాతీయంగా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు మాత్రం ఏబీ డివిలియ‌ర్స్‌, మాథ్యూ ఫోర్డ్ పేరిటే ఉంది. ఇక టీ20 క్రికెట్‌లో యువ‌రాజ్ సింగ్ 12 బంతుల్లో సాధించిన ఫిఫ్టీ రికార్డు ఇప్ప‌టికీ ప‌దిలంగా ఉంది. అయితే క్రికెట్ చ‌రిత్ర‌లో ఏ ఫార్మాట్‌లోనైనా వైభ‌వ్ సూర్య‌వంశీ (11 బంతుల్లో 50 ప‌రుగులు)దే అత్యుత్త‌మం కావ‌డం విశేషం.

 

 

Read: టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాకిస్తాన్ నిష్క్ర‌మ‌ణ‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement