breaking news
Tri Series tournament
-
వైభవ్, తిలక్ మెరుపులు.. శ్రీలంక-ఏ టార్గెట్ 378 రన్స్
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 94 పరుగులు, 10 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ తిలక్ వర్మ (90 బంతుల్లో 67, 4 ఫోర్లు, 1 సిక్సర్) క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మిగిలిన బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ (40), ప్రియాన్ష్ ఆర్య (39) రాణించారు. ఆఖర్లో విప్రజ్ నిగమ్ (27), అనుకుల్ రాయ్ (15 బంతుల్లో 39, 1 ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా ఆడడంతో ఇండియా-ఏ స్కోరు 370 పరుగుల మార్క్‌ను దాటింది. లంక బౌలర్లలో రవిందు ఫెర్నాండో, వనుజా సాహన్చె, కుగతా మథులన్ 2 వికెట్లు తీయగా, మొహమ్మద్ షిరాజ్, సహన్ అరాచిగే, దులజ్ సముదితా తలా ఒక వికెట్ పడగొట్టారు.వైభవ్ జోరు.. లంక బేజారుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ జట్టుకు వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆరంభం నుంచే లంక బౌలర్లను ఉతికారేసిన సూర్యవంశీ 11 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు. ఆ తరవ్ఆత కూడా తన విధ్వంసాన్ని కొనసాగించిన వైభవ్ 29 బంతుల్లో 94 పరుగుల వద్ద ఔటవ్వడంతో అతడి జోరుకు బ్రేకులు పడ్డాయి. వైభవ్ దెబ్బకు 8.5 ఓవర్లలో 132 పరుగులు రాగా.. అందులో వైభవ్ సూర్యవంశీవే 94 పరుగులు ఉండడం గమనార్హం. సూర్యవంశీ ఔటైన తర్వాత ప్రియాన్ష్ ఆర్య కూడా వెనుదిరిగాడు. ఈ దశలో రుతురాజ్‌కు జత కలిసిన తిలక్ వర్మ కాస్త నిధానంగా ఆడడంతో పరుగులు రావడం మందగించింది. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. అనంతరం 220 పరుగుల వద్ద రుతురాజ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కుమార్ కుషాగ్ర కూడా పర్వాలేదనిపించడంతో స్కోరు నత్తనడకనే సాగింది. ఈ దశలో హాఫ్ సెంచరీ చేసిన తిలక్ వర్మ 67 పరుగుల వద్ద ఔటవ్వడంతో ఇండియా-ఏ ఐదో వికెట్ కోల్పోయింది. తిలక్ ఔటైన తర్వాత ఇండియా-ఏకు పరుగులు రాలేదు. వైభవ్ విధ్వంసంతో 400 పరుగులు ఈజీగా వస్తాయనిపించింది. అయితే చివర్లో విప్రజ్, అనుకుల్ రాయ్ మెరుపులతో ఇండియా-ఏ 370 పరుగుల మార్క్‌ను దాటింది. The journey to the Final has been built on knocks like these.💥Now Tilak Varma and India 'A' are one win away from glory.🔥Watch #SLvIND in the #TalentTVCup Final, on 21st June, 10 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony LIV. 📺🏏 pic.twitter.com/yJlAC3IjrB— Sony Sports Network (@SonySportsNetwk) June 19, 2026చదవండి: కవ్వించి తప్పు చేశారు.. వైభవ్ ప్రతీకారం! -
కవ్వించి తప్పు చేశారు.. వైభవ్ ప్రతీకారం!
ముక్కోణపు వన్డే టోర్నీలో భాగంగా భారత సంచలనం వైభవ్ సూర్యవంశీ తనకు కోపమొస్తే ఆ విధ్వంసం ఎంతలా ఉంటుందో లంక ఆటగాళ్లకు రుచి చూపించాడు. మొన్నటికి మొన్న లంక-ఏ ఆటగాళ్లతో గొడవకు దిగి వైభవ్ సూర్యవంశీ విమర్శలకు గురయ్యాడు. బ్యాటింగ్‌లో విఫలం కావడానికి తోడు తన చర్యతో చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. అయితే తనపై వచ్చిన విమర్శలకు, అనవసరంగా గెలికిన లంక ఆటగాళ్లకు ఒక్క ఇన్నింగ్స్‌తో దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చాడు. ఎందుకురా అనసవరంగా పెట్టుకున్నాం వీడితో అనేంతలా వైభవ్ రెచ్చిపోయాడు. క్రీజులోకి దిగిందే మొదలు బాదడమే పరమావధిగా పెట్టుకున్న వైభవ్ తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలచిన వైభవ్ 28 బంతుల వరకు విధ్వంసాన్ని కొనసాగించాడు. ఇక తొలి 11 బంతుల్లో వైభవ్ వరుసగా 4,4,4,6,6,0,6,4,4,6,6 బాదడం విశేషం. తాను ఎదుర్కొన్న 11 బంతుల్లో ఒక డాట్ బాల్ మినహా మిగతా అన్ని బంతులను గమనిస్తే ఫోర్లు, సిక్సర్లే కనిపిస్తాయి. దీన్నిబట్టే వైభవ్ విధ్వంసం ఎలా సాగిందనేది అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తన పేరిట లిఖించుకున్న వైభవ్ ఆ తర్వాత సెంచరీ వైపు పరిగెత్తాడు. చూస్తుండగానే 90ల్లోకి వచ్చిన వైభవ్ 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి ఔటయ్యాడు. వైభవ్ కాస్త కొంచెం ఓపిక వహించి ఉండుంటే లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా తన పేరిట లిఖించుకునేవాడు. అయితే తృటిలో శతకం చేజార్చుకున్నప్పటికీ వైభవ్ ఆడిన 94 పరుగుల ఇన్నింగ్స్ తన కెరీర్లోనే కాదు ప్రపంచ క్రికెట్లో సైతం ఎప్పటికీ గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. అయితే అండర్-19 క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లో సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. ఇక లిస్ట్-ఏ క్రికెట్లో మాత్రం ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ మెక్‌గుర్క్ 29 బంతుల్లో సెంచరీ సాధించడం ఇప్పటికీ ప్రపంచ రికార్డుగా ఉంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఏబీ డివిలియర్స్ 31 బంతుల్లో అందుకున్న రికార్డు శతకం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇక దేశవాలీ క్రికెట్లో 2025-26 విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్‌ప్రదేశ్‌పై 36 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్ లిస్ట్-ఏ క్రికెట్లో శతక్కొట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు. మొత్తం మీద తృటిలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు మిస్‌చేసుకున్న వైభవ్ తనను అనవసరంగా గెలికి తప్పు చేసిన లంక ఆటగాళ్లకు బ్యాటింగ్ పవర్ రుచి చూపించడంతో పాటు ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే 25 ఓవర్లు ముగిసేసరికి ఇండియా-ఏ 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (40), రుతురాజ్ గైక్వాడ్ (31 పరుగులు) క్రీజులో ఉన్నారు. Never mess with a Ego kid😭🔥🔥🔥Scored 11 balls 50 in IND A Finals😭😭With 5 sixes and 5 fours🥵🥵🥵🥵🥵#INDAvsSLA #vaibhav pic.twitter.com/rGQdowLjhh— Prabhas Devotee 🔥 (@SainathPb45) June 21, 20264,4,4,6,6,0,6,4,4,6,6 BY VAIBHAV SOORYAVANSHI IN HIS FIRST 11 BALLS 🥹- 15 YEAR OLD KID IS HAMMERING SRI LANKA. #indvssla pic.twitter.com/VzO2tm9uUb— Arman Cricket Updates (@arman7590) June 21, 2026Read: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు -
వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఏతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు. లీగ్ దశలో లంక- ఏ ఆటగాళ్లతో గొడవను పర్సనల్‌గా తీసుకున్న వైభవ్ మ్యాచ్ ఆరంభం నుంచే లంక బౌలర్లను చీల్చి చెండాడుతూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. గతంలో లిస్ట్-ఏ క్రికెట్లో 2005లో శ్రీలంక క్రికెటర్ కౌషల్య వీరరత్నే 12 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించాడు. తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ లిస్ట్-ఏ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.అంతేకాదు వన్డే ఫార్మాట్లోనూ సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. ఏబీ డివిలియర్స్ 2015లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 16 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. వెస్టిండీస్ బ్యాటర్ మాథ్యూ ఫోర్డ్ కూడా 2025లో ఐర్లాండ్‌తో వన్డేలో 16 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ సాధించాడు. అయితే వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నది అనధికారిక వన్డే మ్యాచ్ కావడంతో అంతర్జాతీయంగా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు మాత్రం ఏబీ డివిలియర్స్, మాథ్యూ ఫోర్డ్ పేరిటే ఉంది. ఇక టీ20 క్రికెట్లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో సాధించిన ఫిఫ్టీ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. అయితే క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్లోనైనా వైభవ్ సూర్యవంశీ (11 బంతుల్లో 50 పరుగులు)దే అత్యుత్తమం కావడం విశేషం. 10 FOURS & 8 SIXES IN JUST 29 BALLS FOR VAIBHAV SOORYAVANSHI IN TRI SERIES FINAL 🥶🔥pic.twitter.com/3x16I9ONwb— Johns. (@CricCrazyJohns) June 21, 2026India A's Vaibhav Sooryavanshi smashed the fastest-ever List A fifty, reaching the milestone in just 11 balls against Sri Lanka A in the Tri-Series final. pic.twitter.com/vnzipNcZ6U— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) June 21, 2026 HEARTBREAK FOR VAIBHAV SOORYAVANSHI. 💔- 94 (29) with 10 fours and 8 sixes in the Tri-Series Final against Sri Lanka. Vaibhav absolutely ruled the Final and answered everyone who were doubting him. 🫡15 YEAR OLD IS SHOWING THE WORLD HIS SLAYING POWERS. 🇮🇳 pic.twitter.com/vk4RX8hFb6— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2026Read: టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమణ -
లంకతో ఫైనల్ మ్యాచ్.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన వైభవ్
శ్రీలంక పర్యటనలో ట్రై సిరీస్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లో శ్రీలంక-ఏ, ఇండియా-ఏ జట్టు తలప డుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక-ఏ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ దూకుడుగా ఆడుతోంది. వైభవ్ ధాటికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అతడికి ప్రియాన్ష్ ఆర్య (22 బ్యాటింగ్) సహకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును వైభవ్ బద్దలుకొట్టాడు.తుది జట్లు:ఇండియా-ఏ: ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(సి), కుమార్ కుషాగ్రా(w), సూర్యాంశ్ షెడ్గే, నిశాంత్ సింధు, అనుకుల్ రాయ్, విప్రజ్ నిగమ్, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్శ్రీలంక-ఏ: నిరోషన్ డిక్వెల్లా(w), అవిష్క ఫెర్నాండో, నువానీదు ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సహన్ అరాచ్చిగే(సి), రవిందు ఫెర్నాండో, వనుజా సహన్, మహ్మద్ షిరాజ్, విజయకాంత్ వియాస్కాంత్, దులజ్ సముదిత, కుగతస్ మతులన్ -
ఆఫ్గన్-ఏతో కీలక మ్యాచ్.. మారని వైభవ్ ఆటతీరు!
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్‌తో ఇండియా-ఏ కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే ఇండియా-ఏ జట్టు ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది. గత మ్యాచ్‌లో లంక ఆటగాళ్లతో గొడవ అనంతరం వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న మ్యాచ్ కావడంతో అతడిపై భారీ అంచనాలున్నాయి. వైభవ్ తాను ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. దీంతో ఈ మ్యాచ్‌లో రాణించి ఎలాగైనా ఫామ్ అందుకోవాలని భావించిన వైభవ్‌కు నిరాశే ఎదురైంది. అప్పటికే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వైభవ్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. 28 బంతుల్లో 38 పరుగులు చేసిన వైభవ్ ఫరీదూన్ బౌలింగ్‌లో ఖాలిద్ తనివాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్గన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు వికెట్ నష్టపోయి 91 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (48), రుతురాజ్ (3) క్రీజులో ఉన్నారు. ఇక మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగినట్లు కెప్టెన్ తిలక్ వర్మ తెలిపాడు. ప్రబ్‌సిమ్రన్‌తో పాటు ఆయుశ్ బదోని ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు తెలిపాడు. మరోవైపు ఆఫ్గన్ మాత్రం అదే జట్టుతో బరిలోకి దిగింది. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్గన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.తుది జట్లు:ఇండియా-ఏ: ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), కుమార్ కుషాగ్రా(వికెట్ కీపర్), నిశాంత్ సింధు, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్అఫ్గానిస్తాన్-ఏ: ఇమ్రాన్ మీర్(కెప్టెన్), హసన్ ఈసాఖిల్, ఖలీద్ తనివాల్, ఫైసల్ షినోజాదా, బహిర్ షా, ఫర్మానుల్లా సఫీ, షమ్స్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ ఇషాక్(వికెట్ కీపర్), జహీర్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్, ఫరీదూన్ దావూద్జాయ్Read: టీమిండియాతో జాయిన్ అవనున్న వైభవ్, తిలక్ వర్మ -
గుజరాత్ టైటాన్స్ ప్లేయర్‌కు జాక్‌పాట్.. టీమిండియాకు ఎంపిక!
ట్రై సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఏతో మ్యాచ్‌లో ఓటమితో ఫైనల్ అవకాశాలను ఇండియా-ఏ క్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓటమి బాధలో ఉన్న ఇండియా-ఏ జట్టుకు గుడ్‌న్యూస్ అందింది. గాయపడిన యద్వీర్ సింగ్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు అశోక్ శర్మను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో అశోక్ శర్మ తక్షణమే శ్రీలంకకు బయల్దేరనున్నాడు. బుధవారం అప్గానిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో అశోక్ శర్మ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అశోక్ శర్మ గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం విశేషం. ఆరు వికెట్లే తీసినప్పటికీ అతడి స్పీడ్ బౌలింగ్ ఇవాళ ఇండియా-ఏ జట్టులోకి పిలుపు వచ్చేలా చేసింది. ఇక యద్వీర్ సింగ్ భుజం గాయంతో ఇండియా-ఏ ఆడిన మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ వేయడంలో ఇబ్బంది పడిన యద్వీర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీంతో అతడి స్థానంలో అశోక్ శర్మను తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. గాయంతో బాధపడుతున్న యద్వీర్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)కు రావాలని బీసీసీఐ అతడిని ఆదేశించింది.బుధవారం అఫ్గానిస్తాన్ జట్టుతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు తప్పక గెలవాల్సి ఉంటుంది. అంతేకాదు మ్యాచ్‌లో గెలవడమే కాదు భారీ రన్‌రేట్ సమకూర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ ఆఫ్గన్ చేతిలో ఓడిపోతే మాత్రం ఇండియా-ఏ జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. అదే సమయంలో అఫ్గానిస్తాన్ జట్టు లంకతో జరిగే తమ చివరి మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం సమీకరణాలు మారిపోనున్నాయి. ఎందుకంటే ఆఫ్గన్‌పై ఇండియా గెలిచి, శ్రీలంకపై ఆఫ్గన్ గెలిస్తే.. ఇరుజట్లు నాలుగు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలతో ఉంటాయి. అప్పుడు నెట్‌రన్‌రేట్ కీలకం కానుంది. చదవండి: కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభవ్! -
సూర్యాన్ష్ మెరుపులు.. ఇండియా-ఏ భారీ స్కోరు
ముక్కోనఫు వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సూర్యాన్ష్ షెడ్గే (72 పరుగులు) ఇన్నింగ్స్‌కు తోడు విప్రాజ్ నిగమ్ (51) సంచలన అర్థసెంచరీ చేయడంతో ఇండియా-ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ (21) మరోసారి నిరాశపరచగా, రుతురాజ్ గైక్వాడ్ (37), కెప్టెన్ తిలక్ వర్మ (23) పర్వాలేదనిపించారు. ఒక దశలో 143 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇండియా-ఏ జట్టును సూర్యాన్ష్, విప్రజ్ ఆదుకున్నారు. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట లోయర్ ఆర్డర్లో సూర్యాన్ష్, విప్రజ్ నిగమ్‌లు బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించారు. ఈ ఇద్దరు కలిసి ఎనిమిదో వికెట్‌కు 104 పరుగులు జోడించడం విశేషం. లంక బౌలర్లలో విజయ్‌కాంత్ వియస్కాంత్ 3 వికెట్లు తీయగా, మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు.చదవండి: పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలు.. గొంతుపట్టుకున్న హర్మన్! -
శ్రీలంక జట్టులో భారీ మార్పులు
కొలంబో: స్వదేశంలో జరగనున్న మహిళల ముక్కోణపు వన్డే టోర్నమెంట్ కోసం శ్రీలంక జట్టు భారీ మార్పులు చేసింది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న టోర్నీ కోసం శ్రీలంక జట్టు 8 మార్పులు చేసి బుధవారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టోర్నీలో శ్రీలంకతో పాటు భారత్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. గత నెలలో న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు 0–2తో సిరీస్ కోల్పోవడంతో జట్టును ప్రక్షాళన చేసింది. సీనియర్ బ్యాటర్ చమరి ఆటపట్టు లంక జట్టుకు సారథ్యం వహిస్తుండగా... న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లో ఆకట్టుకున్న మీడియం పేసర్ మల్కీ మదారాకు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. ఈ టోర్నమెంట్లో ఒక్కో జట్టు మిగిలిన రెండు జట్లతో రెండేసి సార్లు తలపడనుంది. మ్యాచ్‌లన్నీ ప్రేమదాస స్టేడియంలోనే జరగనున్నాయి. వచ్చే నెల 11న ఫైనల్ జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో భారత అమ్మాయిల జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. శ్రీలంక జట్టు: చమరి ఆటపట్టు (కెప్టెన్ ), హర్షిత సమరవిక్రమ, విష్మీ గుణరత్నె, నీలాక్షిక సిల్వ, కవిషా దిల్హారి, అనుష్క సంజీవని, మనుడి ననయక్కర, హాసిని పెరెరా, ఆచిని కులసూర్య, పియూమి బడాల్గే, దేవ్మి విహంగ, హన్సిమ కరుణరత్నె, మల్కీ మదారా, ఇనోషి ప్రియదర్శిని, సుగంధిక కుమారి, రష్మిక, ఇనోక రణవీర. -
సంయుక్తంగా రాణించిన బ్యాటర్లు.. పాకిస్తాన్‌దే ట్రై సిరీస్
న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో జరిగిన ముక్కోణపు టి20 టోర్నీలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. టి20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌కు ఈ విజయం మంచి ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రై సిరీస్‌కు ముందు ఆసియా కప్ ఫైనల్.. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ల్లో పాకిస్తాన్ ఓటమిపాలయింది. ఇక శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. పాక్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 34 పరుగులు), మహ్మద్ నవాజ్(22 బంతుల్లో 38 పరుగులు), హైదర్ అలీ(15 బంతుల్లో 31 పరుగులు).. చివర్లో ఇప్తికర్ అహ్మద్(14 బంతుల్లో 25 నాటౌట్) సంయుక్తంగా రాణించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 59 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. గ్లెన్ పిలిప్స్ 29, మార్క్ చాప్మన్ 25 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో నసీమ్ షా, హారిస్ రౌఫ్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్, నవాజ్‌లు చెరొక వికెట్ తీశారు. రేపు(శనివారం) ఆస్ట్రేలియాకు బయలుదేరనున్న పాకిస్తాన్ జట్టు టి20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో అక్టోబర్ 23న(ఆదివారం)తమ తొలి మ్యాచ్ ఆడనుంది. Nawaz and Iftikhar finish it for Pakistan in the final over 🏆#NZvPAK — ESPNcricinfo (@ESPNcricinfo) October 14, 2022 చదవండి: జర్నలిస్ట్ తిక్క ప్రశ్న.. బాబర్ ఆజం దిమ్మతిరిగే కౌంటర్ -
భారత్ రికార్డ్ ఛేజింగ్; ఆసీస్‌పై గెలుపు
మెల్బోర్న్: ముక్కోణపు టి20 టోర్నీలో భారత మహిళల జట్టు రికార్డు ఛేజింగ్‌తో ఘన విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సమిష్టిగా రాణించి చివరి ఓవర్లో గెలిచింది. 174 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్మృతి మంధాన(55; 48 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించింది. 16 ఏళ్ల షెఫాలి వర్మ బ్యాట్‌తో చెలరేగింది. 18 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 49 పరుగులు చేసింది. ఒక్క పరుగు తేడాతో అర్ధసెంచరీ కోల్పోయింది. రోడ్రిగ్స్(30), కౌర్(20) నాటౌట్‌గా నిలిచారు. భారత మహిళల జట్టుకు టి20ల్లో ఇదే అతిపెద్ద ఛేజింగ్ కావడం విశేషం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు సాధించింది. గార్డ్నర్ విజృంభించి ఆడి 57 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 93 పరుగులు చేసింది. లానింగ్ 37 పరుగులతో ఫర్వాలేదనిపించింది. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు రెండు గెలిచి, రెండు ఓడింది. 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మూడు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచిన ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది. -
భారత మహిళలకు మరో ఓటమి
మెల్బోర్న్: ముక్కోణపు టి20 టోర్నీలో భారత మహిళల జట్టుకు వరుసగా మరో పరాజయం ఎదురైంది. తొలి ముఖాముఖిలో ఇంగ్లండ్‌ను ఓడించిన హర్మన్ సేన ఇప్పుడు రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు తలవంచింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్లతో భారత్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. స్మృతి మంధాన (40 బంతుల్లో 45; 7 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడగా, జెమీమా రోడ్రిగ్స్ (23) ఫర్వాలేదనిపించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అన్యా ష్రబ్సోల్ (3/31) భారత్‌ను దెబ్బ తీయగా, బ్రంట్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది. నటాలియా స్కివర్ (38 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో జట్టును గెలిపించింది. ఇతర ఆటగాళ్లంతా విఫలమైనా... స్కివర్ ఆటతో ఇంగ్లండ్ గట్టెక్కింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 3 వికెట్లు పడగొట్టింది. గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 4 వికెట్లతో ఓడిన భారత్... తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నేడు మళ్లీ ఆస్ట్రేలియాతో తలపడుతుంది.


