గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేయర్‌కు జాక్‌పాట్‌.. టీమిండియాకు ఎంపిక! | Gujarat Titans Star Called Up For India-A Tri-Series-As Team Struggles | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేయర్‌కు జాక్‌పాట్‌.. టీమిండియాకు ఎంపిక!

Jun 16 2026 1:53 PM | Updated on Jun 16 2026 2:06 PM

Gujarat Titans Star Called Up For India-A Tri-Series-As Team Struggles

ట్రై సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఏతో మ్యాచ్‌లో ఓటమితో ఫైనల్ అవకాశాలను ఇండియా-ఏ క్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓటమి బాధలో ఉన్న ఇండియా-ఏ జట్టుకు గుడ్‌న్యూస్ అందింది. గాయపడిన యద్వీర్ సింగ్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు అశోక్ శర్మను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో అశోక్ శర్మ తక్షణమే శ్రీలంకకు బయల్దేరనున్నాడు. 

బుధవారం అప్గానిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో అశోక్ శర్మ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో  గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అశోక్ శర్మ గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం విశేషం. ఆరు వికెట్లే తీసినప్పటికీ అతడి స్పీడ్ బౌలింగ్ ఇవాళ ఇండియా-ఏ జట్టులోకి పిలుపు వచ్చేలా చేసింది. 

ఇక యద్వీర్ సింగ్ భుజం గాయంతో ఇండియా-ఏ ఆడిన మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ వేయడంలో ఇబ్బంది పడిన యద్వీర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీంతో అతడి స్థానంలో అశోక్ శర్మను తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. గాయంతో బాధపడుతున్న యద్వీర్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)కు రావాలని బీసీసీఐ అతడిని ఆదేశించింది.

బుధ‌వారం అఫ్గానిస్తాన్ జ‌ట్టుతో చివ‌రి లీగ్ మ్యాచ్ ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏ జ‌ట్టు త‌ప్ప‌క గెల‌వాల్సి ఉంటుంది. అంతేకాదు మ్యాచ్‌లో గెల‌వ‌డ‌మే కాదు భారీ ర‌న్‌రేట్ స‌మ‌కూర్చుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. ఒక‌వేళ ఆఫ్గ‌న్ చేతిలో ఓడిపోతే మాత్రం ఇండియా-ఏ జ‌ట్టు ఇంటిదారి ప‌ట్టాల్సిందే. 

అదే స‌మ‌యంలో అఫ్గానిస్తాన్ జ‌ట్టు లంక‌తో జ‌రిగే త‌మ చివ‌రి మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం స‌మీక‌ర‌ణాలు మారిపోనున్నాయి. ఎందుకంటే ఆఫ్గ‌న్‌పై ఇండియా గెలిచి, శ్రీలంక‌పై ఆఫ్గ‌న్ గెలిస్తే.. ఇరుజ‌ట్లు నాలుగు మ్యాచ్‌ల్లో రెండేసి విజ‌యాల‌తో ఉంటాయి. అప్పుడు నెట్‌రన్‌రేట్ కీలకం కానుంది. 

చదవండి: కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభ‌వ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement