భారత్‌-శ్రీలంక సిరీస్‌కు సంబంధించి కీలక అప్‌డేట్స్‌ | India's Colombo Warm-up Fixture Shortened Ahead of Sri Lanka Tour | Sakshi
Sakshi News home page

భారత్‌-శ్రీలంక సిరీస్‌కు సంబంధించి కీలక అప్‌డేట్స్‌

Aug 1 2026 3:19 PM | Updated on Aug 1 2026 3:24 PM

Indian teams Colombo warm up fixture shortened by a day

source: BCCI X

టీమిండియా శ్రీలంక పర్యటనకు సంబంధించి ఓ అప్‌డేట్‌ అందుతోంది. ఈ పర్యటనలో భారత్‌ ముందుగా ఓ నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌, ఆతర్వాత రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. వార్మప్ మ్యాచ్‌ వ్యవధిని నాలుగు నుంచి మూడు రోజులకు తగ్గించారు. 

అప్‌డేట్‌ తర్వాత వార్మప్‌ మ్యాచ్‌ ఆగస్టు 7న ప్రారంభమై, ఆగస్టు 9న ముగియనుంది. ఈ మ్యాచ్‌ కొలంబోలోని NCC గ్రౌండ్‌లో జరుగనుంది. వార్మప్‌ మ్యాచ్‌ను ఒక రోజుకు కుదించడానికి గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. ఈ మ్యాచ్‌కు సంబంధించి మరో కీలక విషయం ఏంటంటే, ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఆగస్టు 4న కొలంబోకు బయలుదేరనుంది. మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌ అనంతరం గాలేకు వెళ్లనుంది.తొలి టెస్టు ఆగస్టు 15న గాలేలో ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలోని SSC మైదానంలో జరగనుంది. ఈ సిరీస్‌ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) సైకిల్‌లో భాగంగా జరుగనుంది.

గుడ్‌ న్యూస్‌
లంక సిరీస్‌కు ఫిట్‌నెస్‌ ఆధారంగా జట్టులోకి ఎంపికైన సాయి సుదర్శన్ కోలుకునే దిశగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. బొటనవేలికి స్వల్ప గాయం కారణంగా బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్న అతను ఇప్పటికే బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా మోకాలి సమస్య కారణంగా షరతులతో ఎంపికైన జస్ప్రీత్ బుమ్రా కూడా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే దిశగా ఉన్నట్లు సమాచారం. సిరీస్‌ ప్రారంభానికి ముందే ఇద్దరూ అందుబాటులోకి వస్తారని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement