ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టుకు కాంస్య పతకం లభించింది. అమెరికా జట్టుతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 0–2తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో గుర్‌వీర్ సింగ్ 7–11, 12–10, 9–11, 7–11తో బ్రెండన్ టాగ్లియారిని చేతిలో.... రెండో మ్యాచ్‌లో ఆర్యవీర్ దివాన్ 5–11, 7–11, 5–11తో యాసీన్ షలాబీ చేతిలో ఓటమి పాలయ్యారు. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాన్ని సాధించింది.
రిత్విక్ కాంస్యం
సాక్షి, హైదరాబాద్: పొంటెవెడ్రా అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ కాంస్య పతకం సాధించాడు. స్పెయిన్‌లో జరిగిన ఈ టోర్నీలో రాజా రిత్విక్ నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. 92 మంది ప్లేయర్లు పోటీపడ్డ ఈ టోర్నీలో రిత్విక్ ఐదు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు.
రిత్విక్‌తోపాటు రోడ్రిగెజ్ హెర్నాండెజ్ డేనియల్ (క్యూబా), ముత్తయ్య (భారత్) ఏడు పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ముత్తయ్యకు టైటిల్ లభించగా... డేనియల్‌కు
రెండో స్థానం, రిత్విక్‌కు మూడో స్థానం ఖరారయ్యాయి.


