source: X
హర్యానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కబడ్డీ ఆటగాడు షీలూ బల్హారా భార్య, 23 ఏళ్ల ముస్కాన్ శుక్రవారం మధ్యాహ్నం రోహ్‌తక్ జిల్లాలోని వారి నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
రోహ్‌తక్‌లోని మెహమ్ ప్రాంతానికి చెందిన ముస్కాన్ 2023 డిసెంబర్‌లో షీలూను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు గతేడాది నవంబర్‌లో హార్దిక్ అనే కుమారుడు జన్మించాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని కూడా రంగంలోకి దించి ఆధారాలను సేకరించారు. ముస్కాన్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల విచారణలో భాగంగా ముస్కాన్ సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఘటనకు ఒక్కరోజు ముందు ఆమె పంజాబీ పాటకు సంబంధించిన రీల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ముస్కాన్ మృతికి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కారణం నిర్ధారించేందుకు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలతో పాటు ఇతర ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు.
షీలూ బల్హారా కెరీర్ విషయానికొస్తే.. షీలూకు హర్యానాలో స్టార్ కబడ్డీ ప్లేయర్‌గా పేరుంది. డిఫెన్స్‌లో ‘క్యాచర్’గా అతడు మంచి గుర్తింపు కలిగి ఉన్నాడు. ఈ ఏడాది అతడిని ఓ స్థానిక టోర్నీలో “India’s leading catchers”లో ఒకరిగా ప్రముఖులు పేర్కొన్నారు.


