పాక్‌ కెప్టెన్‌ను హ‌త్తుకున్న టీమిండియా స్టార్‌! వీడియో వైరల్‌ | Jemimah Rodrigues Sparks Debate After Hugging Pakistan Captain Fatima Sana During The Hundred 2026, Watch Video Inside | Sakshi
Sakshi News home page

పాక్‌ కెప్టెన్‌ను హ‌త్తుకున్న టీమిండియా స్టార్‌! వీడియో వైరల్‌

Aug 1 2026 11:09 AM | Updated on Aug 1 2026 12:02 PM

Jemimah Rodrigues Shares Hug With Pakistan Cricketer In The Hundred

P

హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్ 2026లో సదరన్ బ్రేవ్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ విజయం సాధించిన సదరన్ బ్రేవ్‌.. టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.

అయితే సదరన్ బ్రేవ్ వరుస విజయాల్లో భారత స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌ది కీలక పాత్ర. గురువారం బ‌ర్మింగ్‌హ‌మ్ ఫోనిక్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ రోడ్రిగ్స్ సత్తాచాటింది.

వివాదంలో రోడ్రిగ్స్‌
అయితే అద్భుతమైన ప్రదర్శనలతో దూసుకుపోతున్న రోడ్రిగ్స్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఇదే టోర్నీలో పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సన కూడా ఆడుతోంది. ఆమె బ‌ర్మింగ్‌హ‌మ్ ఫోనిక్స్ ప్రాతినిథ్యం వహిస్తోంది. ఈ క్రమంలో సదరన్ బ్రేవ్, బ‌ర్మింగ్‌హ‌మ్ ఫోనిక్స్ మ్యాచ్ ముగిసిన అనంతరం  జెమీమా, ఫాతిమా సన ఒకరినొకరు అలింగనం చేసుకుని ముచ్చటించుకున్నారు. 

కాగా 2025 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేశారు.  ఆసియాకప్‌తో పాటు మెన్స్‌, ఉమెన్స్ వరల్డ్‌కప్‌లలోనూ అదే ఫాలో అయ్యారు. కానీ ఇప్పుడు ఫాతిమా సనాను జెమీమా హత్తు కోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో ఎక్స్ వేదికగా జెమీమాపై భారత అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అందరూ షేక్ హ్యాండ్ ఇస్తుంటే సనాను అలింగనం చేసుకోవాల్సిన అవసరం ఏముందని పోస్ట్‌లు పెడుతున్నారు. మరికొంత మంది ఆమె అక్కడ భారత్ తరపున ఆడడం లేదని, అందుకే అలా చేసిందని సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
చదవండి: ఇంగ్లండ్‌ గడ్డపై ఇరగదీస్తున్న కుల్దీప్‌ యాదవ్‌



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement