మిచెల్ మార్ష్ మాస్ ఇన్నింగ్స్.. సన్‌రైజర్స్‌ రికార్డు విజయం | Mitchell Marsh Leads the Charge As Sunrisers Leeds Register Third Highest Successful Chase In The Hundred | Sakshi
Sakshi News home page

మిచెల్ మార్ష్ మాస్ ఇన్నింగ్స్.. సన్‌రైజర్స్‌ రికార్డు విజయం

Jul 29 2026 12:08 PM | Updated on Jul 29 2026 12:37 PM

Mitchell Marsh, Brook, Crawley star in Sunrisers stunning 181 chase

ది హండ్రెడ్‌-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌కు సన్‌రైజర్స్ లీడ్స్ షాకిచ్చింది. బుధవారం హెడ్డింగ్లీ వేదికగా జ‌రిగిన ప‌దో మ్యాచ్‌లో మాంచెస్ట‌ర్‌ను 8 వికెట్ల తేడాతో స‌న్‌రైజ‌ర్స్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (16 బంతుల్లో 28), ఐడెన్ మార్క్రమ్ (23 బంతుల్లో 32) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ త‌ర్వాత జోస్ బట్లర్ (33 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 53; 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. వీరిద్దరూ లీడ్స్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కేవలం 47 బంతుల్లోనే 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

మార్ష్ విధ్వంసం..
అనంత‌రం 181 ప‌రుగుల ల‌క్ష్యాన్ని స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి మరో 12 బంతులు మిగిలి ఉండగానే ఊదిప‌డేసింది. ఈ భారీ లక్ష్య చేధ‌న‌లో ఓపెన‌ర్‌ మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. ఈ ఆసీస్ కెప్టెన్ మాంచెస్టర్ బౌలర్లను ఉతికారేశాడు.

కేవలం 26 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్‌ జాక్ క్రాలీ(56 నాటౌట్‌), హ్యారీ బ్రూక్‌(17 బంతుల్లో 42) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. మాంచెస్టర్ బౌలర్లలో టంగ్, బాకర్ తలా వికెట్ సాధించారు. కాగా ఇది పురుషుల హండ్రెడ్‌లో మూడవ అత్యధిక విజయవంతమైన ఛేజ్ కావడం విశేషం.
చదవండి: WTC 2025-26: పాక్‌కు భారీ షాక్‌.. ఫైనల్ రేసు నుంచి అవుట్‌! మరి భారత్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement