ట్విన్ బ్రదర్స్ పోరు.. సీఎస్‌కే బౌలర్‌కు చుక్కెదురు | Twin Brothers Clash In The Hundred 2026, Craig Overton Beats Jamie Overton In Thrilling Match Finish, Read Story Inside | Sakshi
Sakshi News home page

The Hundred 2026: ట్విన్ బ్రదర్స్ పోరు.. సీఎస్‌కే బౌలర్‌కు చుక్కెదురు

Jul 27 2026 12:11 PM | Updated on Jul 27 2026 12:45 PM

The Hundred: Craig Overton hits winning runs off twin brother Jamie

courtesy: Sky Sports

ఇంగ్లండ్‌ వేదికగా జరిగే హండ్రెడ్‌లో ట్విన్ బ్రదర్స్ పోరు అభిమానులను అలరించింది. 2026 ఎడిషన్‌లో భాగంగా ట్రెంట్‌ రాకెట్స్‌, లండన్‌ స్పిరిట్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కవల సోదరులు క్రెయిగ్‌ ఓవర్టన్‌, జేమీ ఓవర్టన్‌ తలపడ్డారు. ఈ పోరులో ట్రెంట్ రాకెట్స్ ఆల్‌రౌండర్ క్రెయిగ్ ఓవర్టన్ పైచేయి సాధించాడు.

చివరి ఐదు బంతుల్లో 10 పరుగులు అవసరమైన సమయంలో తన కవల సోదరుడు జేమీ ఓవర్టన్ (లండన్‌ స్పిరిట్‌) బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొని ట్రెంట్ రాకెట్స్‌కు నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. జేమీ ఓవర్టన్‌ ఐపీఎల్‌ 2026లో సీఎస్‌కే ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రెంట్ రాకెట్స్‌కు బెన్ డకెట్ 47 బంతుల్లో 75 పరుగులతో అద్భుత ఆరంభం అందించాడు. చివర్లో క్రెయిగ్ ఓవర్టన్ కేవలం 6 బంతుల్లో అజేయంగా 20 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. జేమీ వేసిన చివరి ఓవర్‌లో సిక్సర్‌తో పాటు రెండు వరుస డబుల్స్ సాధించి మ్యాచ్‌ను ముగించాడు.

అంతకుముందు లండన్ స్పిరిట్ 100 బంతుల్లో 159/9 స్కోరు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ 24 బంతుల్లో 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ లియామ్ లివింగ్‌స్టోన్ 33 పరుగులు చేశాడు. క్రెయిగ్ ఓవర్టన్ బౌలింగ్‌లోనూ సత్తా చాటి రెండు వికెట్లు తీశాడు.

బట్లర్ విధ్వంసం
మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌పై 87 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

బట్లర్ 50 బంతుల్లో 90 పరుగులు చేసి జట్టుకు 187/5 భారీ స్కోరు అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో టామ్ మూర్స్ 17 బంతుల్లో అజేయంగా 39 పరుగులు జోడించాడు.

188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ కేవలం 100 పరుగులకే ఆలౌటైంది. లియామ్ డాసన్ 3/15తో రాణించగా, జోష్ టంగ్, సోనీ బేకర్, నూర్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టి ఫీనిక్స్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. కెప్టెన్ డొనోవన్ ఫెరెరా చేసిన 23 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement