breaking news
Jamie Overton
-
ట్విన్ బ్రదర్స్ పోరు.. సీఎస్కే బౌలర్‌కు చుక్కెదురు
ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్‌లో ట్విన్ బ్రదర్స్ పోరు అభిమానులను అలరించింది. 2026 ఎడిషన్‌లో భాగంగా ట్రెంట్ రాకెట్స్, లండన్ స్పిరిట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కవల సోదరులు క్రెయిగ్ ఓవర్టన్, జేమీ ఓవర్టన్ తలపడ్డారు. ఈ పోరులో ట్రెంట్ రాకెట్స్ ఆల్‌రౌండర్ క్రెయిగ్ ఓవర్టన్ పైచేయి సాధించాడు.చివరి ఐదు బంతుల్లో 10 పరుగులు అవసరమైన సమయంలో తన కవల సోదరుడు జేమీ ఓవర్టన్ (లండన్ స్పిరిట్) బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొని ట్రెంట్ రాకెట్స్‌కు నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. జేమీ ఓవర్టన్ ఐపీఎల్ 2026లో సీఎస్కే ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రెంట్ రాకెట్స్‌కు బెన్ డకెట్ 47 బంతుల్లో 75 పరుగులతో అద్భుత ఆరంభం అందించాడు. చివర్లో క్రెయిగ్ ఓవర్టన్ కేవలం 6 బంతుల్లో అజేయంగా 20 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. జేమీ వేసిన చివరి ఓవర్లో సిక్సర్‌తో పాటు రెండు వరుస డబుల్స్ సాధించి మ్యాచ్‌ను ముగించాడు.అంతకుముందు లండన్ స్పిరిట్ 100 బంతుల్లో 159/9 స్కోరు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ 24 బంతుల్లో 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ లియామ్ లివింగ్‌స్టోన్ 33 పరుగులు చేశాడు. క్రెయిగ్ ఓవర్టన్ బౌలింగ్‌లోనూ సత్తా చాటి రెండు వికెట్లు తీశాడు.బట్లర్ విధ్వంసంమరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌పై 87 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.బట్లర్ 50 బంతుల్లో 90 పరుగులు చేసి జట్టుకు 187/5 భారీ స్కోరు అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో టామ్ మూర్స్ 17 బంతుల్లో అజేయంగా 39 పరుగులు జోడించాడు.188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ కేవలం 100 పరుగులకే ఆలౌటైంది. లియామ్ డాసన్ 3/15తో రాణించగా, జోష్ టంగ్, సోనీ బేకర్, నూర్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టి ఫీనిక్స్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. కెప్టెన్ డొనోవన్ ఫెరెరా చేసిన 23 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు. -
స్కోరు 82/8.... తొమ్మిదో స్థానంలో వచ్చి.. ప్రపంచ రికార్డు!
ఇంగ్లండ్ వేదికగా టీ20 బ్లాస్ట్-2026 లీగ్‌లో సోమర్సెట్ స్టార్ క్రెయిగ్ ఓవర్టన్ అద్భుతం చేశాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మరీ అతడు విధ్వంసం సృష్టించడం విశేషం. 161 పరుగులులీడ్స్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్-4లో యార్క్‌షైర్‌తో సోమర్సెట్ తలపడింది. టాస్ గెలిచిన యార్క్‌షైర్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించింది. యార్క్‌షైర్ బ్యాటర్లలో ఓపెనర్ ఆడం లిత్ అర్ధ శతకం (64) సాధించగా.. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం ఇరవై పరుగులు చేయలేకపోయారు.సోమర్సెట్ బౌలర్లలో జేక్ బాల్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. డానియెల్ సామ్స్, క్రెయిగ్ ఓవర్టన్, రిలే మెరెడిత్ తలా రెండు వికెట్లు కూల్చారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సోమర్సెట్కు యార్క్‌షైర్ బౌలర్లు చుక్కలు చూపించారు.టాప్, మిడిల్ ఆర్డర్ కుదేలుఓపెనర్లలో విల్ స్మీడ్ 21 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. థామస్ రూ ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. వీళ్లిద్దరి వికెట్లను జార్జ్ హిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ టామ్ బాంటన్ (1).. మిడిలార్డర్లో జేమ్స్ రూ (1), టామ్ కోలెర్కాడ్మోర్ (2) ఇలా వచ్చి అలా వెళ్లారు.మిగిలిన వారిలో లోయర్ ఆర్డర్లో లైయీస్ గోల్డ్స్వర్తి 19, కెప్టెన్ లూయీస్ గ్రెగరీ 22 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. డేనియల్ సామ్స్ డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో కేవలం 82 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన సోమర్సెట్ గెలుపుపై ఆశలు వదిలేసుకుంది.From the most unlikely of positions, Craig Overton has pulled off something SPECTACULAR and sent Somerset to Finals Day 😱 pic.twitter.com/EcYh6pgQT5— Vitality T20 Blast (@VitalityBlast) July 15, 2026కేవలం 30 బంతుల్లోనేఇలాంటి తరుణంలో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్ క్రెయిగ్ ఓవర్టన్ అద్భుతం చేశాడు. కేవలం 30 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో ఏకంగా 79 పరుగులు రాబట్టాడు. అతడితో పాటు రిలే మెరెడిత్ ఆరు పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫలితంగా మరో బంతి మిగిలి ఉండగానే సోమర్సెట్ లక్ష్యాన్ని ఛేదించింది. మొత్తంగా 19.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 162 పరుగులు సాధించింది. తద్వారా రెండు వికెట్ల తేడాతో యార్క్‌షైర్‌ను ఓడించి.. సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా శనివారం జరిగే తొలి సెమీస్ మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్‌తో సోమర్సెట్ అమీతుమీ తేల్చుకుంటుంది.క్రెయిగ్ ఓవర్టన్ ప్రపంచ రికార్డుటీ20 క్రికెట్ చరిత్రలో తొమ్మిదో స్థానంలో వచ్చి అత్యధిక స్కోరు (79 నాటౌట్) సాధించిన ఆటగాడిగా క్రెయిగ్ ఓవర్టన్ చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు జమ్మూ కశ్మీర్‌కు చెందిన సయ్యద్ సాగర్ పేరిట ఉండేది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2013లో భాగంగా హర్యానాతో మ్యాచ్‌లో సాగర్ తొమ్మిదో స్థానంలో వచ్చి 36 బంతుల్లో 74 పరుగులు చేశాడు. కాగా క్రెయిగ్ ఓవర్టన్ మరెవరో కాదు ఇంగ్లండ్ స్టార్ జేమీ ఓవర్టన్కు స్వయానా సోదరుడు.చదవండి: విధ్వంసకర శతకాలు.. ప్రపంచ రికార్డు బద్దలు -
సీఎస్కే జట్టులోకి సౌతాఫ్రికా యువ సంచలనం
ఐపీఎల్-2026 సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. కుడి తొడ గాయంతో బాధపడుతున్న ఓవర్టన్.. తదుపరి చికిత్స కోసం యూకేకు తిరుగు ప్రయాణమయ్యాడు.ఈ విషయాన్ని సీఎస్కే మేనెజ్మెంట్ అధికారికంగా ధ్రువీకరించింది. అతడి స్ధానంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డియన్ ఫారెస్టర్‌ను సీఎస్కే తమ జట్టులోకి తీసుకుంది. రూ.75 లక్షల కనీస ధరకు అతడితో చెన్నై సూపర్ కింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది."జేమీ ఓవర్టన్కు కుడి తొడకు గాయమైంది. అతడు తదుపరి చికిత్స కోసం యూకేకు తిరిగి వెళ్లిపోయాడు. ఓవర్టన్ లేకపోవడం జట్టు సమతుల్యతను దెబ్బతీస్తుంది. కానీ కొత్త ఆటగాళ్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాం" సీఎస్కే యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఓవర్టన్ దూరం కావడం సీఎస్కే నిజంగా భారీ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఓవర్టన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి జట్టులో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచారు.అటు బ్యాట్‌తోనూ లోయర్ ఆర్డర్లో కీలక పరుగులు చేస్తూ జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచాడు. ఇక ఓవర్టన్ స్ధానంలో జట్టులోకి వచ్చిన ఫారెస్టర్‌కు అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఇటీవల ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఫారెస్టర్ అదరగొట్టాడు. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో మే 15న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో ఉన్న సీఎస్కేకు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లు అత్యంత కీలకం.చదవండి: IND vs SL: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ -
IPL 2026: సీఎస్కేకు భారీ షాక్!
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మధ్య ఓవర్లలో జట్టుకు కీలకంగా మారిన.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ స్వదేశానికి పయనమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడు.. ఐపీఎల్-2026 టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.స్పందించిన ఫ్రాంఛైజీఈ విషయంపై చెన్నై యాజమాన్యం స్పందిస్తూ.. ‘‘జేమీ ఓవర్టన్ (Jamie Overton) కుడి తొడకు గాయమైంది. అతడు యూకేకు వెళ్లిపోతున్నాడు. వైద్య పరీక్షల అనంతరం అతడి గాయంపై స్పష్టత వస్తుంది’’ అని పేర్కొంది. కాగా ఐపీఎల్-2026లో ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న చెన్నై జట్టు.. ఆరింట గెలిచింది.కీలక ఆల్రౌండర్గాతద్వారా 12 పాయింట్లు సాధించి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో కీలక ఆల్‌రౌండర్ అయిన ఓవర్టన్ గాయం వల్ల జట్టుకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికి 10 మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్.. 14 వికెట్లు కూల్చాడు. అదే విధంగా.. 136 పరుగులు సాధించాడు.ఇదిలా ఉంటే.. సీజన్ ఆరంభం నుంచి చెన్నైని గాయాల బెడద వేధిస్తోంది. జట్టు దిగ్గజ సారథి, వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని ఫిట్నెస్ సమస్యల వల్ల ఇప్పటికి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక పేసర్ రామకృష్ణ ఘోష్ కూడా గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన వేళ.. భారీ షాక్!అంతకు ముందే పేసర్ ఖలీల్ అహ్మద్, ఆయుశ్ మాత్రే, నాథన్ ఎల్లిస్.. అతడి స్థానంలో వచ్చిన స్పెన్సర్ జాన్సన్ కూడా గాయపడి జట్టుకు దూరమయ్యారు. కాగా టోర్నీ ఆరంభంలో వరుస పరాజయాలతో చతికిలపడ్డ చెన్నై.. అనూహ్య రీతిలో పుంజుకుని ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకువచ్చింది. ఇలాంటి కీలక సమయంలో ఓవర్టన్ జట్టుకు దూరం కావడంతో భారీ షాక్ తగిలినట్లయింది.ఇక ఇప్పటికి 11 మ్యాచ్‌లలో 430 పరుగులు సాధించి సంజూ శాంసన్ చెన్నై తరఫున టాప్ రన్ స్కోరర్‌గా ఉండగా.. పేసర్ అన్షుల్ కాంబోజ్ 19 వికెట్లు కూల్చి టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు -
తిలక్ వర్మకు చేదు అనుభవం.. 28 వేల వాచ్ గోవిందా!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ క్రికెటర్ తిలక్ వర్మకు చేదు అనుభవం ఎదురయ్యింది. ముంబై ఇన్నింగ్స్ సమయంలో సీఎస్కే బౌలర్ జేమీ ఓవర్టన్ వేసిన బంతి తిలక్ వర్మ చేతికున్న రిస్ట్ వాచ్‌ను రెండు ముక్కలు చేసింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఓవర్టన్ వేసిన షార్ట్ పిచ్ బంతిని షాట్ ఆడే క్రమంలో తిలక్ వర్మ మిస్ చేశాడు. దీంతో బంతి తిలక్ వర్మ చేతికి బలంగా తాకింది. నొప్పితో బాధపడిన తిలక్‌ను ఫిజియో వచ్చి పరిశీలించాడు. అదే సమయంలో చేతికున్న రిస్ట్ వాచ్ రెండు ముక్కలు కావడం గమనార్హం. కాగా తిలక్‌వర్మ తన చేతికి ధరించిన రిస్ట్ వాచ్ ధర రూ.28 వేలు కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో తిలక్ వర్మ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన తిలక్ వర్మ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57) అర్థసెంచరీతో రాణించగా.. రికెల్టన్ 37 పరుగులు చేశాడు.𝗧𝗜𝗠𝗘 𝗢𝗨𝗧 ⌚🤐#TilakVarma’s wrist-watch, too, now has a #BiggestRivalry story to tell 👀#TATAIPL Revenge Week 2026 ➡️ #CSKvMI | LIVE NOW 👉https://t.co/wLcMjiCsSi pic.twitter.com/cCLwL6SYux— Star Sports (@StarSportsIndia) May 2, 2026చదవండి: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ క్రికెటర్ -
జేమీపై తిలక్ వర్మ ఫైర్.. మధ్యలో సూర్య.. ఆఖరికి!
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్- ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు ప్రత్యేక అభిమానులు ఉంటారు. చెరో ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన ఈ జట్ల మధ్య పోటీ అంటే అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. ఐపీఎల్-2026లో భాగంగా గురువారం నాటి మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు.అయితే, ఈ మ్యాచ్‌లో చెన్నై ముంబైపై ఏకపక్ష విజయం సాధించింది. సొంతమైదానం వాంఖడేలో హార్దిక్ సేనను రుతురాజ్ బృందం ఏకంగా 103 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఐపీఎల్లో పరుగుల పరంగా ముంబైకి ఇదే అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం.జేమీతో గొడవపడ్డ తిలక్ వర్మఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా ముంబై బ్యాటర్లు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్- చెన్నై బౌలింగ్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ మధ్య వాగ్వాదం జరిగింది. ముఖ్యంగా తిలక్ జేమీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇంతలో సూర్య కూడా జోక్యం చేసుకుని జేమీని నిందించగా.. అతడు గట్టిగానే బదులిచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. చెన్నై విధించిన 208 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబై పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి కుదేలైంది. ఈ క్రమంలో తిలక్ వర్మ- సూర్య ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.ఫీల్డర్‌ను చూడనివ్వవా?ఇక ముంబై ఇన్నింగ్స్ పదో ఓవర్లో జేమీ ఓవర్టన్ బంతితో రంగంలోకి దిగి స్లో బాల్ సంధించగా.. తిలక్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో సూర్య- తిలక్ కలిసి సింగిల్ పూర్తి చేసుకోగా.. తిలక్ ఇంకో రన్ కోసం పిలుపునిచ్చాడు. అయితే, సూర్య ఇందుకు నిరాకరించగా.. తిలక్ వేగంగా నాన్-స్ట్రైకర్ ఎండ్‌వైపు చేరుకున్నాడు.అయితే, అదే సమయంలో ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న జేమీ.. తిలక్‌కు అడ్డుగా వచ్చి రనౌట్ చేయాలని చూశాడు. దీంతో తిలక్ వర్మ సీరియస్ అయ్యాడు. తనను కావాలనే జేమీ అటకాయించాడని.. ఫీల్డర్‌ను చూడకుండా చేశాడని ఫైరయ్యాడు. దీంతో జేమీ కూడా ధీటుగా బదులివ్వగా సూర్య జోక్యం చేసుకున్నాడు.Heat. Pressure. Drama 😤This rivalry never disappoints 🔥#TATAIPL 2026 | #MIvCSK | LIVE NOW 👉 https://t.co/vkBKeocOG2 pic.twitter.com/hETDJPFFK3— Star Sports (@StarSportsIndia) April 23, 2026సూర్య కూడా ఫైర్.. అంపైర్ల జోక్యంతోఅయితే, సూర్యకు కూడా జేమీ కౌంటర్ ఇవ్వగా పరిస్థితి విషమిస్తుందని భావించిన అంపైర్లు వీరిని విడదీశారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత జేమీని తిలక్ వర్మ హత్తుకున్నాడు. దీంతో ఈ వివాదం ఇక్కడితో సమసిపోయినట్లు అయింది.ఈ మ్యాచ్‌లో తిలక్ 29 బంతుల్లో 37 పరుగులు చేయగా.. సూర్య 30 బంతుల్లో 36 రన్స్ చేశాడు. అయితే, సీఎస్కే బౌలర్ల దూకుడు ముందు వీరు నిలవలేకపోయారు. ఫలితంగా 19 ఓవర్లలో కేవలం 104 పరుగులు చేసి ముంబై ఆలౌట్ అయింది.చదవండి: Hardik pandya: బ్యాటింగ్ రాదు.. బౌలింగ్ రాదు! నీకు కెప్టెన్సీ అవసరమా? -
సౌతాఫ్రికాతో మూడో వన్డే.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్‌కు చోటు
సౌతాఫ్రికాతో ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయిన ఇంగ్లండ్ ఆఖరి మ్యాచ్‌కు సిద్దమైంది. ఆదివారం సౌతాంప్టన్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో ఎలాగైనా గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.ఈ క్రమంలో మూడో వన్డేకు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇంగ్లండ్ క్రికెట్ శనివారం ప్రకటించింది. ఇంగ్లండ్ తమ తుది జట్టులో కేవలం ఒకే ఒక మార్పు చేసింది. పేసర్ సాకిబ్ మహమూద్ స్దానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ జామీ ఓవర్టన్ జట్టులోకి వచ్చాడు. ఓవర్టన్ ఇటీవలే రెడ్‌బాల్ క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో విఫలమైన బెన్ డకెట్‌ను మూడో వన్డేకు కొనసాగించారు. అయితే డకెట్‌కు ప్రోటీస్‌తో టీ20ల నుంచి మాత్రం సెలక్టర్లు తప్పించారు. గత కొంతకాలంగా అవిరామంగా క్రికెట్ ఆడుతుండడంతో అతడికి విశ్రాంతి ఇచ్చారు. కాగా తొలి వన్డేలో సఫారీల చేతిలో 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన ఇంగ్లండ్.. అనంతరం రెండో వన్డేలో పోరాడి ఓడింది. దీంతో సిరీస్‌ను కోల్పోయింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్-2027కు నేరుగా ఆర్హత సాధించే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌కు తదుపరి వన్డే మ్యాచ్‌లు చాలా కీలకంగా మారనున్నాయి.మూడో వన్డేకు ఇంగ్లండ్ తుది జట్టుజేమీ స్మిత్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ -
ఇంగ్లండ్ స్టార్ కీలక నిర్ణయం.. ఇకపై..
లండన్: ఇంగ్లండ్ పేసర్ జేమీ ఓవర్టన్ (Jamie Overton) సంప్రదాయ క్రికెట్‌కు విరామం ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నానని... అందుకే టెస్టులకు నిరవధిక విరామం ప్రకటిస్తున్నట్లు చెప్పాడు. అయితే ఐదు రోజుల ఆటకు ఇది రిటైర్మెంట్ కాదు. 31 ఏళ్ల ఇంగ్లండ్ క్రికెటర్ ఇటీవల భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొన్నాడు. 2–2తో సమమైన ఆ సిరీస్‌లో అతను రెండు టెస్టులు ఆడాడు.నాకిది ఇబ్బందికరం‘కెరీర్ జోరుగా సాగిపోతున్న ఈ దశలో ఏడాదిలో 12 నెలలు అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉండాలంటే కుదరదు. అలా ప్రతీ ఫార్మాట్‌కు న్యాయం చేయలేను. శారీరకంగా, మానసికంగానూ నాకిది ఇబ్బందికరం. అందుకే బాగా ఆలోచించాకే టెస్టులకు విరామం ప్రకటిస్తున్నాను. అప్పుడు నేను పూర్తిగా పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువ దృష్టిపెట్టొచ్చు. సుదీర్ఘకాలం పాటు వన్డేలు, టీ20లు ఆడేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదం చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా’ అని ఓవర్టన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యంకాగా 2022లో పరిమిత ఓవర్ల క్రికెట్లోప ప్రయాణం మొదలుపెట్టిన ఓవర్టన్.. ఇప్పటివరకు ఓవర్టన్ కేవలం 6 వన్డేలు, 12 టీ20లే ఆడాడు. ఐపీఎల్లో అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక లండన్‌లో ఇటీవల జరిగిన ‘ది హండ్రెడ్’ టోర్నీలో లండన్ స్పిరిట్‌కు ఆడాడు. ఓవర్టన్ అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో జరిగే టీ20 లీగ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా ప్రణాళిక చేసుకుంటున్నాడు. చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రషీద్ ఖాన్.. సరికొత్త చరిత్ర


