PC: BCCI/X
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్- ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు ప్రత్యేక అభిమానులు ఉంటారు. చెరో ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన ఈ జట్ల మధ్య పోటీ అంటే అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. ఐపీఎల్-2026లో భాగంగా గురువారం నాటి మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు.
అయితే, ఈ మ్యాచ్‌లో చెన్నై ముంబైపై ఏకపక్ష విజయం సాధించింది. సొంతమైదానం వాంఖడేలో హార్దిక్ సేనను రుతురాజ్ బృందం ఏకంగా 103 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఐపీఎల్‌లో పరుగుల పరంగా ముంబైకి ఇదే అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం.
జేమీతో గొడవపడ్డ తిలక్ వర్మ
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా ముంబై బ్యాటర్లు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్- చెన్నై బౌలింగ్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ మధ్య వాగ్వాదం జరిగింది. ముఖ్యంగా తిలక్ జేమీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇంతలో సూర్య కూడా జోక్యం చేసుకుని జేమీని నిందించగా.. అతడు గట్టిగానే బదులిచ్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. చెన్నై విధించిన 208 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబై పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి కుదేలైంది. ఈ క్రమంలో తిలక్ వర్మ- సూర్య ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
ఫీల్డర్‌ను చూడనివ్వవా?
ఇక ముంబై ఇన్నింగ్స్ పదో ఓవర్లో జేమీ ఓవర్టన్ బంతితో రంగంలోకి దిగి స్లో బాల్ సంధించగా.. తిలక్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో సూర్య- తిలక్ కలిసి సింగిల్ పూర్తి చేసుకోగా.. తిలక్ ఇంకో రన్ కోసం పిలుపునిచ్చాడు. అయితే, సూర్య ఇందుకు నిరాకరించగా.. తిలక్ వేగంగా నాన్-స్ట్రైకర్ ఎండ్‌వైపు చేరుకున్నాడు.
అయితే, అదే సమయంలో ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న జేమీ.. తిలక్‌కు అడ్డుగా వచ్చి రనౌట్ చేయాలని చూశాడు. దీంతో తిలక్ వర్మ సీరియస్ అయ్యాడు. తనను కావాలనే జేమీ అటకాయించాడని.. ఫీల్డర్‌ను చూడకుండా చేశాడని ఫైరయ్యాడు. దీంతో జేమీ కూడా ధీటుగా బదులివ్వగా సూర్య జోక్యం చేసుకున్నాడు.
Heat. Pressure. Drama 😤
This rivalry never disappoints 🔥#TATAIPL 2026 | #MIvCSK | LIVE NOW 👉 https://t.co/vkBKeocOG2 pic.twitter.com/hETDJPFFK3— Star Sports (@StarSportsIndia) April 23, 2026
సూర్య కూడా ఫైర్.. అంపైర్ల జోక్యంతో
అయితే, సూర్యకు కూడా జేమీ కౌంటర్ ఇవ్వగా పరిస్థితి విషమిస్తుందని భావించిన అంపైర్లు వీరిని విడదీశారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత జేమీని తిలక్ వర్మ హత్తుకున్నాడు. దీంతో ఈ వివాదం ఇక్కడితో సమసిపోయినట్లు అయింది.
ఈ మ్యాచ్‌లో తిలక్ 29 బంతుల్లో 37 పరుగులు చేయగా.. సూర్య 30 బంతుల్లో 36 రన్స్ చేశాడు. అయితే, సీఎస్‌కే బౌలర్ల దూకుడు ముందు వీరు నిలవలేకపోయారు. ఫలితంగా 19 ఓవర్లలో కేవలం 104 పరుగులు చేసి ముంబై ఆలౌట్ అయింది.
చదవండి: Hardik pandya: బ్యాటింగ్ రాదు.. బౌలింగ్ రాదు! నీకు కెప్టెన్సీ అవసరమా?


