బ్యాటింగ్ రాదు.. బౌలింగ్ రాదు! నీకు కెప్టెన్సీ అవసరమా? | Hardik pandya poor form continues in ipl 2026 | Sakshi
Sakshi News home page

Hardik pandya: బ్యాటింగ్ రాదు.. బౌలింగ్ రాదు! నీకు కెప్టెన్సీ అవసరమా?

Apr 23 2026 11:34 PM | Updated on Apr 24 2026 12:45 AM

Hardik pandya poor form continues in ipl 2026

ఐపీఎల్‌-2026 సీజన్‌లో ముం‍బై ఇండియన్స్ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. కెప్టెన్‌గా, వ్యక్తిగత ప్రదర్శన పరంగా హార్దిక్‌ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ దారుణంగా విఫలమయ్యాడు.

తొలుత బౌలింగ్‌లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం కీలక సమయంలో బ్యాటింగ్‌ వచ్చిన హార్దిక్‌.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ర్యాష్‌ షాట్‌ ఆడి తన వికెట్‌ను వికెట్‌ను కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ పరంగా కూడా హార్దిక్‌ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.

చెత్త నిర్ణయాలు తీసుకుంటూ జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్‌ పాండ్యా కేవలం 97 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కూడా కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో హార్దిక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.

బ్యాటింగ్‌ రాదు, బౌలింగ్‌ రాదు.. కెప్టెన్సీ అవసరమా హార్దిక్‌ అంటూ ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టాడు. ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది.

సీఎస్‌కే ఘన విజయం
ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 103 పరుగుల తేడాతో సీఎస్‌కే ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. సీఎస్‌కే స్పిన్నర్‌ అకిల్‌ హుస్సేన్‌ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబై పతనాన్ని శాసించాడు.

 అతడితో పాటు నూర్‌ అహ్మద్‌ రెండు, గుర్‌జప్‌నీత్‌, కాంబోజ్‌, ముఖేష్‌ చౌదరి, కాంబోజ్‌ తలా వికెట్‌ సాధించారు. ముంబై బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌(36), తిల‌క్ వ‌ర్మ‌(37) మిన‌హా మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఈ విజయంతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో ఐదో స్దానానికి చేరుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement