హ్యాట్సాఫ్‌ సార్‌..! భలే గుణపాఠం చెప్పారు.. | Cop Teaches Lesson To Commuters Driving On Footpath Goes Viral | Sakshi
Sakshi News home page

హ్యాట్సాఫ్‌ సార్‌..! భలే గుణపాఠం చెప్పారు..

Jun 7 2026 3:02 PM | Updated on Jun 7 2026 3:50 PM

Cop Teaches Lesson To Commuters Driving On Footpath Goes Viral

రోడ్ల మీద ప్రయాణికులు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలిసిందే. కనీసం బస్తాప్‌ వద్ద కూడా రయ్‌ రయ్‌ అంటూ వెళ్లిపోవడమే. ప్రయాణికులు బస్సలు ఎక్కనివ్వరు, కనీసం ఫుట్‌పాత్‌పై నిలబడనివ్వరు. అలాంటి టూ వీలర్‌ ప్రయాణికులకు ఇక్కడొక పోలీసు అధికారి భలే గుణపాఠం చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడంతో ఆ అధికారిపై ప్రశంసల జల్లు వెల్లువెత్తింది. 

ఆ వీడియోలో పోలీసు అధికారి రద్దీగా ఉన్న రోడ్డుపై వెళ్తుండగా..ట్రాఫిక్‌ జామ్‌ను దాటాలనే ఉద్దేశ్యంతో ప్రయాణికులు ఎలా మాములు ఫుట్‌పాత్‌పై వాహానాలు నడుపుతున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసిన ఈ పోలీసు అధికారి వెంటనే కొద్ది దూరం ప్రయాణించి ఫుట్‌పాత్‌పై బైక్‌తో సహా అడ్డంగా నిలబడతాడు. 

దీంతో రాంగ్‌రూట్‌లో వస్తున్న ఆ టూవీలర్‌ ప్రయాణికులు కాస్తా వెనుదిరిగి వెళ్లడం తప్ప మరో మార్గం లేకుండాపోయింది. దాంతో నెటిజన్లు ఏం ధైర్యం సార్‌ అంటూ ఆ పోలీసు అధికారిని అభినందించగా, మరికొందరు హ్యాట్సాప్‌ సార్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: భారత్‌ని విడిచి వెళ్తున్న ప్రతిసారి గుండె పగిలిపోతోంది ..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement