లుక్స్‌, భాష పరంగా..అభద్రతా భావంతో ఉండేదాన్ని..! | Miss Universe Kerala Kaziah Liz Mejo Said Insecure Of Her Looks | Sakshi
Sakshi News home page

ఆత్మవిశ్వాసం ఉంటే..అద్భుతం చేయొచ్చు!: మిస్‌ యూనివర్స్‌ కేరళ

Jun 7 2026 1:23 PM | Updated on Jun 7 2026 1:23 PM

Miss Universe Kerala Kaziah Liz Mejo Said Insecure Of Her Looks

కజియా లిజ్ మెజో (Kaziah Liz Mejo) 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ కేరళ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. కేవలం 19 ఏళ్ల వయస్సులోనే ఈ టైటిల్‌ను గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా ఆమె అరుదైన రికార్డును సృష్టించారు. అయితే ఆమెను ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ గెలుపు ఎలా సాధ్యమైందని ప్రశ్నించగా..అందుకు కజియా చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారామె. 

మిస్‌ యూనివర్స్‌ ఇండియాకు సిద్ధమవుతున్న ఈ 19 ఏళ్ల యువతి..తన లుక్స్‌, సంభాషణ పరంగా అభద్రతా భావంతో ఉండేదాన్ని అని చెప్పింది. దాంతో ఆత్మవిశ్వాసంగా ఉండలేకపోయాదాన్ని అని వాపోయారు. అయితే దీన్ని అధిగమించడం రాత్రికి రాత్రే జరిగిపోలేదన్నారు. ఇలా కాదు మొదట తాను కాన్ఫిడెంట్ని డెవలప్‌ చేసుకోవాలని నిర్ణయించుకున్నాని అన్నారామె. అందుకోసం తనపై తాను ఫోకస్‌ పెట్టడం ప్రారంభించానని అన్నారామె. 

అంటే నా సంభాషణ నైపుణ్యాలు, వ్యక్తిత్వం, రూపం ఇలా మొత్తం తనపై తాను ఎక్కువ దృష్టి పెట్టి మెరుగయ్యేలా చేసుకున్నానని అన్నారు. అయితే తనకు బాగా హెల్ప్‌ అయిన విషయం ఏంటంటే..సాధించే వరకు ఆపొద్దు అనే సూత్రంం. ఈ భూమ్మీద నేనే అత్యంత ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిని అని తన బ్రెయిన్‌ని పూర్తిగా నమ్మించి వేదికలపైకి కాన్ఫిడెన్స్‌గా నడవగలిగానని అన్నారు. 

ఇక తనకు ఈ అందాల పోటీలపై ఆసక్తి మొదలైంది..2021లో భారతదేశం మిస్ యూనివర్స్ గెలవడాన్ని చూసిన తర్వాతేనని అన్నారామె. అంతవరకు అందాల పోటీల గురించి పెద్దగా తెలియదని అన్నారు. భారత్‌ ఆ పోటీల్ల గెలవడంతో తనలో ఏదో స్ఫూర్తి రగిలిందన్నారు. అదీగాక హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ 2021ను గెలుచుకోవడంతో భారత్‌ 21 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లైందని పేర్కొంది. అంతకుముందు 1994లో సుష్మితా సేన్, 2000లో లారా దత్తా ఈ టైటిల్‌ని గెలుచుకున్నారు. 

అయితే చాలామంది ఈ అందాల పోటీలను కేవలం శారీరక సౌందర్య ప్రదర్శనగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. అయితే ఈ అందాల పోటీలు గెలిచినా, గెలవకపోయినా..మీ గొంతుని కనుగొనడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం వంటివి ఎన్నో నేర్పిస్తుందన్నారు. పైగా ఈ జర్నీలోని ఎంతో మెరుగవుతాం అంటూ తన సంభాషణను ముగించారామె.

(చదవండి: అంతా అయిపోయాక కాదు..ముందుగా తెలుసుకోవాల్సిన ఆరోగ్య పాఠాలు..!)

 

 

Advertisement
 
Advertisement
Advertisement