బరువు తగ్గే జర్నీలు ఇప్పటి వరకు వర్కౌట్లు, పక్కా ప్లాన్‌తో నిలకడగ చేసి.. స్లిమ్‌గా మారిన వారి గురించి విన్నాం. అలా కాకుండా ఈ మహిళ వెరైటీగా రోజువారీ జీవితంలో భాగమైన బోరింగ్ అలవాట్లతో బరువు తగ్గింగిదట. సంక్లిష్టమైన డైట్, వర్కౌట్లు లేకుండా.. సింపుల్‌గా చేసేవి, మన రోజువారి కొన్ని రకాల అలవాట్లకే దూరంగా ఉంటే బరువు తగ్గడం సులభం అంటోంది ఆ మహిళ. మరి అదెలాగో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా.!
షావీ అనే మహిళ తాను కేవలం 12 నెలల్లో 35 కిలోలు తగ్గానంటూ..తనకు ఉపకరించిన ఆరు ప్రభావవంతమైన జీవనశైలి మార్పులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన రోజువారీ క్రమశిక్షణలో పాతుకుపోయిన సరళమైన, స్థిరమైన అలవాట్లు తన బరువు తగ్గే ప్రయాణంలో ఎలా కీలక పాత్ర పోషించాయో సవివరంగా వెల్లడించారామె.
డైనింగ్ టేబుల్ వద్ద కుటుంబంతో కలిసి రాత్రి భోజనం చేయకపోవడం
ఇది తాను బరువు తగ్గే దశలో చేసిన తాత్కాలిక మార్పుగా షావీ పేర్కొంది. కుటుంబంతో ఉంటే తన డైట్ గురించి చేసే వ్యాఖ్యలు బరువు తగ్గడంపై ఫోకస్‌ని దూరం చేస్తాయని ఈ మార్పు చేసినట్లు వివరించారామె. అందుకే తాను వారితో కలిసి తినడం మానేశానని అన్నారామె. తనకు, ఇది కుటుంబం నుంచి భావోద్వేగపరంగా దూరం కావడం గురించి కాదని పేర్కొంది.
రాత్రి భోజనం చేసిన వెంటనే బ్రష్ చేయడం
ఆ రోజుకు తినడం అధికారికంగా ముగిసిందని తన మెదడుకు అది ఒక అధికారిక 'షట్ డౌన్' లాంటిది," అని ఆమె అంటోంది. నియంత్రణ కోల్పోయి, మళ్ళీ తినేసిన రోజుల్లో, తాను మరోసారి బ్రష్ చేసుకునేదాన్నని షావీ చెబుతుంది. ఆ చిన్న చర్య తన మనసులో ఒక హద్దును సృష్టించి.. వంటగది క్లోజ్ అయ్యిందని చెబుతుండేదని అన్నారామె.
స్క్రీన్ లేకుండా ఎక్కువగా తినే అలవాటును పాటించడం
ఇలా చేస్తే ఎక్కువగా తినం, పైగా తింటున్న ఆహారంపై అటెన్షన్ ఉంటుందని అంటోంది. ఎప్పుడైనా ఎక్కువగా తినాలనిపిస్తే, ఏ స్క్రీన్ లేకుండానే పూర్తి చేస్తానని అంటోంది.
ఎక్కువగా తినడాన్ని రేపటికి వాయిదా వేయడం
నియంత్రణకు బదులుగా, పోస్ట్‌పోన్ చేయడం ఒక సాధనంగా మారుతుంది. ‘నేను దీన్ని రేపు తినగలను’ అని చెప్పుకుంటూ ఉంటే.. ఎప్పుడోకప్పుడూ తింటాననే సంతృప్తి అతిగా తినడాన్ని నియంత్రణలో ఉంచుతుందని అంటున్నారు.
ఫ్రిజ్‌లో ప్రోటీన్‌ను కనిపించేలా ఉంచడం
తినే ఆహారం కంటికి కనిపించే చేరువలో పెడితే..అవి తీసుకోవాలనే స్పృహ ఉంటుందని అంటోంది. అందుకే వేయించిన శనగలు, సోయా, పనీర్, ఉడికించిన గుడ్లు, చీజ్, ఇవి ఎప్పుడూ కంటికి కనిపించేలా పెట్టుకునేదాన్ని అని చెబుతున్నారామె.
ఫుడ్ రీల్స్‌కి దూరంగా ఉండటం..
కంటెంట్ వినియోగానికి, తినాలనే కోరికలకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని వివరించింది షావీ. రోజంతా బ్రెయిన్‌కి ఆహార సంబంధిత కంటెంట్‌ను అందించడం ఆపేసినప్పుడు, తినాలనే కోరికలు చాలా వరకు తగ్గుతాయని అంటోంది.
మనం ఏం చూస్తామో అదే తినాలని అనుకుంటామని అని చెబుతోంది షావీ. వినడానికి విచిత్రంగా ఉన్నా..కష్టంగా లేకుండా ఆచరణాత్మకంగా చిన్నపాటి మార్పులతోనే సులభంగా బరువు తగ్గే బెస్ట్ రెమిడ్స్‌లా ఉన్నాయి కదూ. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి.
(చదవండి: ఆత్మవిశ్వాసం ఉంటే..అద్భుతం చేయొచ్చు!: మిస్ యూనివర్స్ కేరళ)


