ఢిల్లీలో మళ్లీ అగ్ని ప్రమాదం: రంగంలోకి ఫైర్ ఫైటర్స్ | Blaze Erupts Inside Karkardooma Court Complex | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మళ్లీ అగ్ని ప్రమాదం: రంగంలోకి ఫైర్ ఫైటర్స్

Jun 7 2026 9:21 AM | Updated on Jun 7 2026 9:21 AM

Blaze Erupts Inside Karkardooma Court Complex

న్యూఢ్లిలీ: దేశ రాజధాని ఢిల్లీలోని తూర్పు ప్రాంతంలో ఉన్న కార్కర్దూమా కోర్టు కాంప్లెక్స్‌లో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. కోర్టు కాంప్లెక్స్‌లోని గేట్ నంబర్ 4 సమీపంలో ఉన్న రెండో అంతస్తులోని స్కానింగ్ రూమ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. స్కానింగ్ రూమ్‌లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

మాలవీయ నగర్ విషాదం మరువకముందే..
ఇటీవలే ఢిల్లీలోని మాలవీయ్‌ నగర్‌లోని ఉన్న ఒక హోటల్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ విషాదం మరువక ముందే మరో అగ్ని ప్రమాదం జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించిన భవనాలపై కఠిన చర్యలు చేపట్టేందుకు  ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన 12 అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement