సాక్షి, ఢిల్లీ :ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుతుండడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (శని, ఆదివారాలు) నుంచి ఆదివారం వరకూ రాజధాని నగరంలోని మద్యం షాపులన్నింటినీ రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
సాధారణంగా ఢిల్లీలో మద్యం షాపులు రాత్రి 10 గంటల వరకూ వైన్ షాపులు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. అయితే ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద నిరసనలు శాంతిభద్రతల దృష్ట్యా, నగరంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించిన ఢిల్లీ పోలీసులు మద్యం షాపుల వేళలను కుదించాలని ప్రభుత్వానికి సూచించారు.
కాగా ఇటీవలే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా గురువారం రాత్రి కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే మద్యం షాపులను త్వరగా మూసివేయడంతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రభుత్వం రాత్రి ఎనిమిది గంటలకే మద్యం షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.


